బి‌ఆర్‌ఎస్ పై వార్.. మళ్ళీ షురూ !

తెలంగాణలో బి‌ఆర్‌ఎస్ మరియు బిజెపి( BRS party ) మద్య వార్ ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే.

కే‌సి‌ఆర్ లక్ష్యంగా బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తుంటే.

మోడీ లక్ష్యంగా బి‌ఆర్‌ఎస్ నుంచి ప్రతివిమర్శలు వినిపిస్తూ ఉంటాయి.వచ్చే ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ ఉంటే.

ఏకంగా కేంద్రంలో మోడీని ఓడించడమే లక్ష్యంగా కే‌సి‌ఆర్ ఉన్నారు.ఇలా ఉప్పు నిప్పులా ఉండే బీజేపీ బి‌ఆర్‌ఎస్ పార్టీలు.

గత కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉంటున్నాయి.విమర్శలు గాని ఆరోపణలు గాని ఏవి చేయడం లేదు ఇరు పార్టీల నేతలు.

Advertisement

ఆ మద్య తెలంగాణలో ఐటీ దాడులు, ఎమ్మెల్సీ కవితా లిక్కర్ స్కామ్ వంటి వాటితో నానా హంగామా చేసింది బీజేపీ.అలాగే కే‌సి‌ఆర్ కూడా మోడీ పాలనపై ఒంటికాలుపై లేచి తీవ్ర విమర్శలు గుప్పించేవారు.కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి కనిపించడంలేదు.

మోడీ( Narendra Modi )పై గాని, బీజేపీ పై గాని కే‌సి‌ఆర్ విమర్శలు గుప్పించడమే పక్కన పెట్టేశారు.తన ప్రసంగాలలో కూడా బీజేపీ ప్రస్తావన లేకుండా చూసుకుంటున్నారు.

మరి ఇంట హటాత్తుగా కే‌సి‌ఆర్ బీజేపీ( CM KCR )పై మౌనంగా ఉండడానికి కారణం.బీజేపీ బి‌ఆర్‌ఎస్ మద్య రహస్య పొత్తు కుదిరిందనేది కొందరు చెబుతున్నా మాట.అందుకే కవితా అరెస్ట్ ఆగిందని, తెలంగాణలో ఐటీ రైడ్ లు జరగడం లేదని.పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే అదేం లేదని నిరూపించేందుకు బి‌ఆర్‌ఎస్ పై బీజేపీ మళ్ళీ యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది.బి‌ఆర్‌ఎస్ నేతలపై ఇటీవల వరుసగా ఐటీ రైడ్ లు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే ఫైళ్ళ శేఖర్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి , ఎంపీ ప్రభాకర్ రెడ్డి వంటి వారిపై మని లాండరింగ్ కింద ఐటీ రైడ్ నిరవహిస్తోంది.

ఏంటి భయ్యా.. స్వీట్ షాప్ కు స్వీట్స్ కొనడానికి వచ్చాయా ఏంటి ఎలుకలు(వీడియో)
జగన్ తప్పు తెలుసుకున్నారా ? ప్రక్షాళన కు సిద్ధమా ? 

దీంతో ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న బీజేపీ.మళ్ళీ ఇప్పుడు బి‌ఆర్‌ఎస్ ను టార్గెట్ చేయడంతో అసలు బీజేపీ, బి‌ఆర్‌ఎస్ మద్య ఏం జరుగుతోందనే చర్చ ఆసక్తికరంగా మారింది.

Advertisement

మరి బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఐటీ రైడ్ లపై బి‌ఆర్‌ఎస్ అధిష్టానం ఎలా స్పందింస్తుంది, గత కొన్ని రోజులుగా బీజేపీ పై విమర్శలు చేయని కే‌సి‌ఆర్, కే‌టి‌ఆర్.మళ్ళీ బీజేపీ పై విమర్శల బాణం ఎక్కుబెడతారా ? అనేది చూడాలి.మొత్తానికి బీజేపీ, బి‌ఆర్‌ఎస్ మద్య నెలకొంటున్న పరిణామాలు విశ్లేషకులకు సైతం అర్థం కానీ పరిస్థితి.

మరి ముందు రోజుల్లో ఈ రెండు పార్టీల మద్య ఇంకెలాంటి పరిణామాలు చేసుకుంటాయో చూడాలి.

తాజా వార్తలు