పిల్లలు అల్లరి చేస్తున్నారని ఆమె చేసిన పనికి తల్లిదండ్రులు సీరియస్‌... జైలుకు వెళ్లే పరిస్థితి వచ్చింది

పిల్లలు అల్లరి చేస్తే తల్లిదండ్రులు కూడా కొట్టేందుకు ఇష్టపడరు.వారిని ఏదోలా దారిలో తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

హద్దులు దాటి, మితిమీరితే తప్ప ఒక దెబ్బ వేస్తారు.అంతే కాని కట్టేయడాలు, నోరుకు ప్లాస్టర్‌ వేయడాలు ఏమీ ఉండవు.

అప్పట్లో కృష్ణడు తెగ అల్లరి చేస్తూ, ఒక్క చోట ఉండకుండా ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతున్నాడని యశోదమ్మ రోలుకు కట్టేసింది.కాని ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు.

పిల్లలకు స్వేచ్చను ఇవ్వాలని చట్టాలు కూడా చెబుతున్నాయి.కొన్ని దేశాల్లో పిల్లలపై చేయి చేసుకుంటే కేసు, అరెస్ట్‌లు, జైలు శిక్షలు కూడా ఉన్నాయి.

Advertisement

పిల్లలు అంటే అంతా కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నారు.అలాంటి పిల్లలు స్కూల్‌ లో ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారో అనే విషయాన్ని తల్లిదండ్రులు పెద్దగా ఆలోచించరు.

కొందరు మాత్రం తమ పిల్లల్ని స్కూల్‌లో టీచర్‌ ఏ విధంగా విద్యావంతుల్ని చేస్తున్నారంటూ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.కార్పోరేట్‌ స్కూల్‌లో పిల్లల క్లాస్‌ రూంలో సీసీ కెమెరాలు ఫిక్స్‌ చేస్తారనే విషయం తెల్సిందే.అలా హరియాణాలోని ఒక కార్పోరేట్‌ స్కూల్‌లో ప్రైమరీ క్లాస్‌ పిల్లల రూంలో సీసీ కెమెరాలు ఫిక్స్‌ చేయడం జరిగింది.

సీసీ కెమెరాల్లో తాజాగా రికార్డు అయిన ఒక విజువల్‌ అందరికి షాక్‌కు గురి చేసింది.క్లాస్‌లో టీచర్‌ విద్యార్థి తెగ అల్లరి చేస్తున్నాడనే ఉద్దేశ్యంతో ఏకంగా నోటికి ప్లాస్టర్‌ వేసింది.

ఆ పిల్లాడికి నోటికి ప్లాస్టర్‌ వేసిన సమయంలో ఇరత పిల్లలంతా కూడా షాక్‌ అయ్యి చూస్తున్నారు.ఆమె అత్యంత భయంకరంగా చేసిన పనికి వారు అవాక్కయ్యారు.పిల్లల విషయంలో తల్లిదండ్రులు కూడా అంత కఠినంగా వ్యవహరించరని, ఆమె వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం అవుతుంది.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఆ వీడియో వైరల్‌ అవ్వడంతో పిల్లల తల్లిదండ్రులు మరియు విద్యార్థి సంఘాల వారు అంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

వారి ఆందోళనకు దిగి వచ్చిన స్కూల్‌ యాజమాన్యాలు వెంటనే స్కూల్‌ నుండి ఆ టీజర్‌ను తొలగిస్తున్నట్లుగా ప్రకటించారు.తల్లిదండ్రులకు ఆ టీజర్‌ తరపున ప్రిన్సిపల్‌ క్షమాపణలు చెప్పాడు.టీచర్‌ మరియు స్కూల్‌ యాజమాన్యంపై పోలీస్‌ కేసు నమోదు అయ్యింది.

వారిని అరెస్ట్‌ చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేస్తున్నారు.పిల్లలు ఇలా అయితే స్కూల్‌కు రారని, కాస్త స్మూత్‌గా వారితో వ్యవహరించాలని నిపుణులు చెబుతున్నారు.

ఇలాంటి సంఘటనలు చూస్తే ప్లిల్ని స్కూల్క్‌కు పంపించేందుకు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు