ప్రవేశాలలో వివక్ష ఎత్తివేత: హార్వార్డ్‌ విశ్వవిద్యాలయానికి ఫెడరల్ కోర్టు ఆదేశం

హార్వార్డ్ విశ్వవిద్యాలయంలో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న ఆసియా-అమెరికన్ విద్యార్థులకు ఫెడరల్ కోర్టు శుభవార్త చెప్పింది.ఇకపై ఆసియా-అమెరికన్ విద్యార్ధుల అడ్మిషన్లపై వివిక్షచూపరాదని తీర్పు వెలువరించింది.

సోమవారం ఫెడరల్ డిస్ట్రిక్ట్ జడ్జి అల్లిసన్ డి.బరోస్ మాట్లాడుతూ గత కొన్ని దశాబ్ధాలుగా సవ్యంగా సాగుతున్న ప్రవేశ కార్యక్రమానికి కోర్టు ఆటంకం కలిగించదన్నారు.అయితే అదే సమయంలో శ్వేతజాతి, నలుపు వర్ణం, స్పానిష్ తరగతులకు చెందిన వారికి తాము ఆసియా-అమెరికన్ల కంటే అధిక ప్రాధాన్యతనిస్తున్నామన్న వర్సిటీ వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది.

ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ఈ కేసులో విచారణ సాగుతుందని న్యాయమూర్తి తెలిపారు.

హార్వార్డ్ విశ్వవిద్యాలయం అమెరికాలో ప్రఖ్యాత విద్యాసంస్థల్లో ఒకటి.ప్రతి ఏడాది ఇందులో ప్రవేశాల కోసం 42,000 మంది దరఖాస్తు చేసుకుంటారు.వీరిలో 1,600 మందికి మాత్రమే వర్సిటీ అవకాశం కల్పిస్తుంది.

Advertisement

అయితే ఈ విశ్వవిద్యాలయంలో జాతి ఆధారంగా అడ్మిషన్లు కల్పించే పద్ధతిని ఎత్తివేయాలంటూ స్టూడెంట్స్ ఫర్ ఫెయిర్ అడ్మిషన్స్ ఫెడరల్ కోర్టులో పిటిషన్ వేసింది.

వలసదారులకు షాక్ : గ్రీన్ కార్డ్‌ దరఖాస్తులను నిలిపివేసిన అమెజాన్, గూగుల్
Advertisement

తాజా వార్తలు