హుజూరాబాద్ ఓట‌మిపై హ‌రీశ్ చాక‌చ‌క్యం.. కార‌ణం వారేన‌ట‌..

తెలంగాణ రాజ‌కీయాల్లో క్రియాశీలకంగా ఉన్న హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫ‌లితం వ‌చ్చేసింది.

అంద‌రూ ఎంతో ఉత్కంఠ‌గా ఎదురు చూసిన ఈ పోటీలో సునాయాసంగా ఈట‌ల రాజేంద‌ర్ విజ‌యం సాధించారు.

ఈటల రాజేంద‌ర్ ఎంచుకున్న ఆత్మ గౌరవ నినాదం బాగానే ప‌నిచేసింది.మొద‌టి నుంచి గెలుపు మీద భారీ అంచ‌నాలు పెట్టుకున్న టీఆర్ ఎస్‌కు పెద్ద షాక్ త‌గిలింది.

గ‌త చరిత్ర‌లో ఎన్న‌డూ లేనంత డ‌బ్బును ఈ ఎన్నిక కోసం టీఆర్ ఎస్ ఖ‌ర్చు పెట్టింది.ఏకంగా ద‌ళిత బంధు లాంటి స్కీమ్‌ను పెట్టారంటేనే దీన్ని ఎంత సీరియ‌స్ గా తీసుకున్నారో అర్థం అవుతుంది.

ఇక హ‌రీశ్ రావు అయితే దాదాపు ఆరు నెల‌లుగా గెలుపు బాధ్య‌త‌ను త‌న భుజాల మీద వేసుకుని తిరిగారు.తమకు హుజూరాబాద్ లో అస‌లు ఈటల రాజేంద‌ర్ పోటీనే కాదని త‌మ గెలుపు ఖాయ‌మ‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

Advertisement

కానీ చివ‌ర‌కు హుజూరాబాద్ ఓటర్లు సంచ‌ల‌న తీర్పు ఇచ్చారు.దీంతో ఈ ఓట‌మిని మొత్తం హ‌రీశ్ మీద నెట్టేస్తార‌ని అంతా అనుకున్నారు.

కానీ హ‌రీశ్ రావు చాలా చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్టు క‌నిపించింది.దుబ్బాక‌, హుజూరాబాద్ రెండింటి బాధ్య‌త‌ల‌ను చూసుకున్న హ‌రీశ్ రావుకు రెండు చోట్లా ఎదురు దెబ్బ త‌గిలింది.

కానీ హుజూరాబాద్ ఫ‌లితాన్ని త‌న భుజాన వేసుకోకుండా ప్రజా తీర్పును శిరసావహిస్తామని చెబుతూనే మ‌రో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.గ‌తంలో కంటే ఇప్పుడు టీఆర్ఎస్ కు హుజూరాబాద్ లో ఓట్లు ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని చెప్పారు.అయితే జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్ అలాగే బీజేపీలు ఎక్క‌డా లేని విధంగా కలిసి పని చేశాయని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

కాంగ్రెస్ కావాల‌నే ముంద‌స్తుగా అభ్య‌ర్థిని పెట్ట‌కుండా బీజేపీకి మ‌ద్ద‌తు ఇచ్చింద‌ని చెప్పారు.ఈ విష‌యాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్లే చెబుతున్నార‌ని నైతికంగా త‌మే విజ‌య‌మ‌ని ఒక్క ఓటమి తో టీఆర్ ఎస్ వెన‌క్కు త‌గ్గ‌ద‌ని చెప్పుకొచ్చారు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

దీన్ని బ‌ట్టి చూస్తే హ‌రీశ్ రావు త‌న‌ను తాను బాగానే వెన‌కేసుకొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు