శిఖర్ ధావన్‌ కి దండం పెట్టిన హార్ధిక్ పాండ్య.. ఎందుకంటే..!?

నిన్న పూణే వేదికగా జరిగిన వన్డే ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లండ్, టీం ఇండియా హోరాహోరీ తలపడ్డాయి.

ముఖ్యంగా 22 ఏళ్ల యంగ్ క్రికెటర్ శ్యామ్ కరణ్ ఒక్కడే టీమిండియా బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు.

మెయిన్ బ్యాట్స్ మెన్లు అందరూ అవుట్ అయిన తర్వాత కూడా తమ జట్టును విజయతీరాలకు వైపు నడిపించేందుకు శ్యామ్ కరణ్ చూపించిన పోరాట ప్రతిమ ప్రతి ఒక్కరిని ఫిదా చేసింది అంటే అతిశయోక్తి కాదు.టీం ఇండియా మాజీ క్రికెటర్లు కూడా కరణ్ ని పొగడ్తలతో ముంచెత్తారు.

ఒక యువ క్రికెటర్ ఆ స్థాయిలో పట్టువీడని విక్రమార్కుడు వలె పోరాటం చేయడం నిజంగా ప్రశంసనీయం.అయితే అతడు ఇచ్చిన క్యాచ్ ని హార్దిక్ పాండ్యా ఒకానొక సమయంలో చేజార్చాడు.

దీంతో అతడు మ్యాచ్ అయిపోయేంత వరకు ఫోర్లు సిక్సర్లు కొడుతూ భారత క్రికెట్ ఆటగాళ్లను బాగా తిప్పలు పెట్టారు.నిజానికి అతడి వల్లే పూణే మ్యాచ్ చాలా రసవత్తరంగా మారింది.

Advertisement

అయితే హార్దిక్ పాండ్యా నిన్న జరిగిన వన్డే మ్యాచ్ లో ఈజీ క్యాచ్ లను కూడా మిస్ చేశారు.ముఖ్యంగా విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌ అయిన బెన్ స్టోక్స్ క్యాచ్ మిస్ చేశారు.

దీంతో టీమిండియా మొత్తం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయింది.మూడవ ఓవర్ లో భువనేశ్వర్ వేసిన బంతిని బెన్ స్టోక్స్ గాల్లోకి లేపారు కానీ దాన్ని పట్టుకోవడంలో హార్దిక్ పాండ్యా విఫలమయ్యారు.

దీంతో విరాట్ కోహ్లీ కూడా కాస్త కలవరపడ్డారు.కానీ కొంత సమయానికి బెన్ స్టోక్స్ కొట్టిన బంతి మళ్లీ గాల్లోకి ఎగరడం తో ఈసారి దాన్ని శిఖర్ ధావన్ క్యాచ్ పట్టగలిగారు.

దీంతో హార్థిక్ పాండ్యా ఒక్క సారిగా ఊపిరి పీల్చుకున్నారు.ఆపై శిఖర్ ధావన్ కి దండంపెడుతూ శిరస్సు వంచి పాదాభివందనం చేశారు.దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.అయితే మొదటి క్యాచ్ ఇచ్చిన సమయంలో బెన్ స్టోక్స్ కేవలం 16 పరుగులు చేశారు కానీ హార్థిక్ పాండ్యా మిస్ ఫీల్డ్ కారణంగా బెన్ స్టోక్స్ 39 బంతులు ఆడ గలిగారు.39 బంతుల్లో ఆయన నాలుగు ఫోర్లు ఒక సిక్సర్ కొట్టి 35 పరుగులు చేశారు.ఆ తర్వాత శిఖర్ ధావన్ క్యాచ్ పట్టడంతో అవుటయ్యారు.

సోదరి, బావ కలిసి చేతబడి చేశారంటూ పోలీస్ కంప్లైంట్.. అధికారులు షాక్..??
Advertisement

తాజా వార్తలు