రాజ‌మండ్రిలో లోన్ యాప్ వేధింపులు.. దంప‌తులు ఆత్మ‌హ‌త్య‌

రాజ‌మండ్రిలో విషాదం నెల‌కొంది.లోన్ యాప్ నిర్వాహ‌కుల వేధింపులు తాళ‌లేక దంప‌తులు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు.

దీంతో ఇద్ద‌రు చిన్నారులు అనాథ‌లుగా మిగిలారు.ఆనందన‌గ‌ర్ పేప‌ర్ మిల్లు వ‌ద్ద నివాసం ఉంటున్న దుర్గారావు, ల‌క్ష్మీ భార్యాభ‌ర్త‌లు ఆన్‎లైన్ యాప్‎లో కొంత మొత్తం లోన్ తీసుకున్నారు.

అనుకున్న స‌మ‌యానికి క‌ట్ట‌లేక‌పోవ‌డంతో.దుర్గారావు భార్య ఫొటోలు మార్ఫింగ్ చేసి ఆన్‎లైన్‎లో పెడుతామ‌ని యాప్ నిర్వాహ‌కులు బెదిరింపుల‌కు దిగారు.

దీంతో తీవ్ర మ‌న‌స్థాపానికి గురైన దంప‌తులు ఓ లాడ్జిలో బ‌ల‌వ‌న్మ‌ర‌ణం చెందారు.మ‌రోవైపు, దంప‌తుల ఆత్మ‌హ‌త్య ఘ‌ట‌న‌పై సీఎం జ‌గ‌న్ విచారం వ్య‌క్తం చేశారు.

Advertisement

అనాథ‌లుగా మారిన ఇద్ద‌రు చిన్నారుల‌కు ప్ర‌భుత్వం త‌ర‌పున ఆర్థిక‌సాయం ప్ర‌క‌టించారు.చిన్నారుల‌కు రూ.5 ల‌క్ష‌ల చొప్పున ఆర్థిక‌సాయం అందించాల‌ని జిల్లా కలెక్ట‌ర్‎కు ఆదేశాలు జారీ చేశారు.అదేవిధంగా పిల్లల సంర‌క్ష‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని తెలిపారు.

బాహుబలి 3 రాబోతోందా.. హింట్ ఇచ్చిన నిర్మాత.. సంతోషంలో ప్రభాస్ ఫ్యాన్స్!
Advertisement

తాజా వార్తలు