సీతారామం కాపీ కామెంట్స్ పై స్పందించిన డైరెక్టర్.. ఆనందంగా ఉందంటూ?

ఈ ఏడాది విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్లలో ఒకటిగా నిలిచిన సీతారామం సినిమాలోని కొన్ని సన్నివేశాలను దర్శకుడు హను రాఘవపూడి మల్లీశ్వరి సినిమా నుంచి స్పూర్తి పొందారని సోషల్ మీడియాలో కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

వైరల్ అవుతున్న వీడియోలను చూసిన నెటిజన్లు సీతారామంలోని కొన్ని సీన్లు కాపీనేనని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ కామెంట్లు తన దృష్టికి రావడంతో హను రాఘవపూడి ఈ కామెంట్ల గురించి స్పందించి తనదైన శైలిలో జవాబిచ్చారు.లవ్ ప్రపోజల్ సీన్ అనేది చాలా సింపుల్ ఐడియా అని ఆయన చెప్పుకొచ్చారు.

ఒక అబ్బాయి తనను ప్రేమించిన ప్రేయసికి భరోసా ఇవ్వడాన్ని ఆ సన్నివేశంలో చూపించాలని నేను అనుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు.ఆ రీజన్ వల్లే హీరో తన సంపాదన గురించి చెప్పేలా చేశానని ఇది బేస్ ఐడియా అని ఈ సన్నివేశాన్ని మల్లీశ్వరి నుంచి కాపీ కొట్టాల్సిన అవసరం అయితే లేదని హను రాఘవపూడి అన్నారు.

ఏది ఏమైనా సీతారామం సినిమాను మల్లీశ్వరి సినిమాతో పోల్చడం ఆనందంగా ఉందని హను రాఘవపూడి కామెంట్లు చేశారు.

Advertisement

సీతారామం సినిమా కథను దుల్కర్ కే మొదట చెప్పానని ఆయన అన్నారు.నానితో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నానని సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుందని హను రాఘవపూడి వెల్లడించారు.రామ్, విజయ్ దేవరకొండలను వేర్వేరు కథల కోసం కలిశానని ఆయన అన్నారు.

సీతారామం సినిమా క్లైమాక్స్ లో రామ్ పాత్రను చంపకుండా ఉండాలని చాలామంది అభిప్రాయపడ్డారని హను రాఘవపూడి తెలిపారు.క్లైమాక్స్ కు సంబంధించి అసిస్టెంట్ డైరెక్టర్లతో నాకు చాలాసార్లు గొడవలు జరిగాయని హను రాఘవపూడి చెప్పుకొచ్చారు.హను రాఘవపూడి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు