చికాగో: ఏడేళ్ల చిన్నారిపై కాల్పులు.. నిందితుడు 15 ఏళ్ల బాలుడు

చికాగోలో హలోవీన్ పార్టీలో జరిగిన కాల్పులకు ఘటనకు సంబంధించి 15 ఏళ్ల బాలుడిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.చికాగో పోలీస్ డిపార్ట్‌మెంట్ కథనం ప్రకారం శుక్రవారం సాయంత్రం 5.

30 ప్రాంతంలో 3700 బ్లాక్‌లోని 26వ నెంబర్ వీధిలో హలోవీన్ పార్టీ జరిగింది.ఈ క్రమంలో మైనర్ బాలుడు.31 ఏళ్ల వ్యక్తిపై కాల్పులు జరిపాడు.తనను ఎవరు గుర్తుపట్టకుండా ఉండేందుకు గాను ఒక సినిమా క్యారెక్టర్‌కు చెందిన మాస్క్‌ను ముఖానికి ధరించాడు.

ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన ఏడేళ్ల బాలికను దగ్గరలోని స్ట్రాంగర్ ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం ఆమె పరిస్ధితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.చేతికి గాయమైన మరో వ్యక్తిని మౌంట్ సినాయ్ ఆసుపత్రికి తరలించారు.

సదరు బాలుడిపై రెండు హత్యాయత్నాలు, తుపాకీని కలిగి ఉండటం వంటి అభియోగాలు మోపారు.

Advertisement

పిల్లలు రాత్రిపూట వీధుల్లో గుమిగూడే సమయంలో ఈ ఘటన జరగడం దిగ్భ్రాంతికరమని.మంచు కారణంగా ఆ రోజు రాత్రి చాలా తక్కువగా చిన్నారులు అక్కడ సంచరిస్తున్నారని పోలీసులు తెలిపారు.కాగా.

శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఓ హలోవీన్ పార్టీలో జరిగిన కాల్పుల్లో ఐదుగురు మరణించిన సంగతి తెలిసిందే.ఈ ఘటనతో ఇకపై పార్టీ హౌస్‌లను నిషేధిస్తున్నట్టు ఎయిర్‌బీఎన్‌బీ సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు