డేరాబాబా కు పెరోల్ కావాలంట....ఎందుకో తెలుసా!

గతేడాది వివిధ కేసుల్లో దోషిగా తేలడం తో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్,డేరాబాబా జీవిత ఖైదు అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు జైలు లో ఉన్న డేరా బాబా ఇప్పుడు వ్యవసాయం చేస్తాను నాకు పెరోల్ ఇవ్వండి అని కోరనున్నట్లు తెలుస్తుంది.

తనను తాను దైవ స్వరూపుడిగా చిత్రీకరించుకుని ఆశ్రమంలో పనిచేసే ఇద్దరు మహిళల పై అత్యాచారం చేయడమే కాకుండా ఆయనపై పలు ఆరోపణలు వెల్లువెత్తాయి.ఈ క్రమంలో ఆయనకు యావజ్జీవ శిక్ష విధించగా గత 23 నెలలుగా జైలు లోనే ఉంటున్నారు.

అయితే ప్రస్తుతం జైలుశిక్ష అనుభవిస్తున్న డేరా బాబాకు వ్యవసాయం మీద గాలి మళ్లినట్లుంది.ఈ నేపథ్యంలో ఆయన తన పెరోల్‌ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తుంది.

ఆశ్రమం కోసం వ్యవసాయం చేసుకుంటానని.తనకు పెరోల్‌ ఇప్పించాల్సిందిగా దరఖాస్తులో కోరాడు.

Advertisement

తాను చేసినవి క్షమించరాని నేరాలేం కాదని, జైలులో తన ప్రవర్తన కూడా సంతృప్తికరంగా ఉంది కాబట్టి తాను పెరోల్‌కు అర్హుడినేని దెరాబాబా పేర్కొనడం విశేషం.అయితే సిర్సా జైలు యాజమాన్యం డేరాబాబా దరఖాస్తును ప్రస్తుతం పరిశీలిస్తుంది.

ఇంకా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకొనట్లు తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు