Meenakshi Chaudhary : ఆ స్టార్ హీరోతో డ్యాన్స్ అనగానే గుండెల్లో దడ మొదలైంది.. మీనాక్షి చౌదరి కామెంట్స్ వైరల్!

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ మీనాక్షి చౌదరి( Meenakshi Chaudhary ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

మీనాక్షి ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

అందులో భాగంగానే మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమాతో తాజాగా ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దుగుమ్మ.ఈ సినిమాలో మీనాక్షి పాత్ర నిడివి చాలా తక్కువ అన్న విషయం మనందరికీ తెలిసిందే.

ఇకపోతే ఈ సినిమా విడుదలకు ముందు విడుదల తర్వాత మీనాక్షి పేరు సోషల్ మీడియాలో గట్టిగానే వినిపిస్తోంది.ఇది ఇలా ఉంటే తాజాగా మీనాక్షికి సంబంధించి మరో ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది.

అదేమిటంటే మీనాక్షి తాజాగా ఒక బంపర్ ఆఫర్ ను కొట్టేసింది.తమిళ స్టార్ హీరో దళపతి విజయ్( Vijay ) తో కలిసి నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది.విజయ్ నటిస్తోన్న‌ తాజా చిత్రం ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ఆల్‌ టైం ఈ చిత్రంలో విజయ్ తండ్రీ, కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు.

Advertisement

ఈ చిత్రాన్ని వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది.అయితే తాజాగా విజయ్‌ చిత్ర షూటింగ్‌లో పాల్గొన్న పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

విజయ్‌తో కలిసి పనిచేయడం తన అదృష్టమని చెప్పుకొచ్చింది.ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.

విజయ్ తో కలిసి ఒక పాటకు డాన్స్‌ చేయనున్నట్లు దర్శకుడు ముందుగా చెప్పగానే నాకు దడ మొదలైంది.

దీనికి కారణం ఆయన గొప్ప డాన్సర్‌ కావడమే.అయితే విజయ్‌ మాత్రం తనతో చాలా ఉన్నతంగా నడచుకున్నారని తెలిపింది మీనాక్షి చౌదరి.ఆయనకు నేను కూడా వీరాభిమానిని అని తెలిపింది.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?

విజయ్‌ షూటింగ్‌ స్పాట్‌లో ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరు.చాలా ప్రశాంతంగా ఉంటారు.

Advertisement

ఆయనతో కలిసి నటించడం సరికొత్త అనుభవం అని తెలిపింది.ఈ సందర్భంగా మీనాక్షి చౌదరి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇకపోతే కాగా మైక్‌ మోహన్‌ విలన్‌గా నటిస్తున్న ఈ ప్రశాంత్‌, ప్రభుదేవా, ప్రేమ్‌జీ, వైభవ్‌ అరవింద్‌ ఆకాష్‌, నటి స్నేహ, లైలా ముఖ్యపాత్రల్లో పోషిస్తున్నారు.ఇక మీనాక్షి సినిమాల విషయాకొనిస్తే.ప్రస్తుతం టాలీవుడ్‌లో మీనాక్షి చౌదరి బిజీగా ఉన్నారు.

అంతే కాకుండా ఇంతకుముందే విజయ్‌ ఆంటోని కథానాయకుడిగా నటించిన కొలై చిత్రంలో కీలక పాత్రను పోషించారు.అదే విధంగా ఆర్‌జే బాలాజీ( RJ Balaji ) సరసన నటించిన సింగపూర్‌ సెలూన్‌ చిత్రం ఈ నెల 25వ తేదీన విడుదల కానుంది.

తాజా వార్తలు