రేపటి నుంచి ఏపీలో వైఎస్ షర్మిల పర్యటన..!

ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల( YS Sharmila ) రాష్ట్ర పర్యటనకు షెడ్యూల్ ఖరారు అయిన సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా రేపు శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం నుంచి షర్మిల పర్యటన ప్రారంభం కానుంది.

 Ys Sharmila's Visit To Ap From Tomorrow , Ys Sharmila, Ap, Kakinada, Konaseema-TeluguStop.com

అలాగే విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలో షర్మిల పర్యటన కొనసాగనుంది.

తరువాతి రోజు విశాఖ, అల్లూరి మరియు అనకాపల్లి జిల్లాలోని పార్టీ నేతలతో సమావేశం కానున్నారు.25న కాకినాడ, కోనసీమ జిల్లాలతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు.26న తూర్పు గోదావరి, ఏలూరు మరియు ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించనున్న షర్మిల 27న కృష్ణా, పల్నాడు, గుంటూరు జిల్లాలకు వెళ్లనున్నారు.28న నెల్లూరు, ప్రకాశం, బాపట్ల., 29న తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో పర్యటించిన అక్కడి నేతలతో సమావేశం కానున్నారు.

అలాగే 30వ తేదీన శ్రీసత్యసాయి, అనంతపురం మరియు కర్నూలు జిల్లాలో పర్యటన కొనసాగనుంది.

తరువాత 31న నంద్యాలతో పాటు వైఎస్ఆర్ కడప జిల్లాలో షర్మిల పర్యటించనున్నారు.జిల్లాలోని ఇడుపులపాయతో షర్మిల పర్యటన ముగియనుంది.పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన షర్మిల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పర్యటించనున్నారన్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube