ట్రంప్ మద్దతుదారులపై గన్ ఫైర్..ర్యాలీలో ఊహించని ఘటన..!

అమెరికాలో ఎన్నికల ఫలితాలపై రిపబ్లికన్ పార్టీ నేతలు ముందు నుంచి వ్యతిరేకతను ప్రదర్శిస్తున్న విషయం విధితమే.

ముఖ్యంగా ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎన్నికలు చట్టబద్దంగా జరగలేదని, అమెరికా చరిత్రలో ఈ స్థాయిలో అవినీతితో జరిగిన ఎన్నికలు ఇవేనని ట్రంప్ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.

అదే క్రమంలో సుప్రీంకోర్టు సైతం ట్రంప్ వాదనలో నిజంలేదని, అందుకు సరైన సాక్ష్యాలు లేవని ట్రంప్ మద్దతు దారులు వేస్తున్న వాజ్యాలను వరుసగా కొట్టేస్తోంది.దాంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను వ్యతిరేకిస్తూ ట్రంప్ మద్దతు దారులు వాషింగ్టన్ లో ర్యాలీ చేపట్టారు.

అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న ఆరోపణలలో నిజం ఉందని, ఈ ఎన్నికలు చట్టవ్యతిరేకంగా జరిగాయని నినాదాలు చేసారు.శ్వేత సౌధానికి కాస్త దూరంలోనే ఉన్న ఫ్రీడం ప్లాజా వద్ద నిరసనలు చేపట్టారు.

వేలాదిగా వచ్చిన నిరసన కారులతో రోడ్లన్నీ నిండిపోయాయి.ఈ క్రమంలోనే ఒక్కసారిగా నిరసన కారులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడులకు దిగడం ప్రారంభించారు.

Advertisement

అందుకు ప్రతిగా నిరసన కారులు కూడా వారిపై దాడులకు యత్నించారు.దాంతో ఒక్క సారిగా ఆ ప్రాంతం మొత్తం ఆందోళన కరంగా మారిపోయింది.

ఈ పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి.

ఇరు వర్గాల మధ్య గొడవలు అదుపులోకి తెచ్చేందుకు వారిమధ్య సైకిళ్ళు, వాహనాలు ఉంచి గొడవలు ఆపేలా ప్రయత్నాలు చేసారు.దాంతో నిరసన కారులు పోలీసులపై దాడికి దిగడంతో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ట్రంప్ కు మద్దతుగా నినాదాలు చేశారు ఆందోళన కారులు.అయితే ఈ నిరసనలపై అమెరికా మీడియా చాలా తేలిగ్గా తీసిపారేసింది.

ట్రంప్ నవంబర్ లో చేసిన నిరసనలకంటే కూడా ఇప్పుడు చాలా తక్కువ మంది జాజరయ్యారు అంటే ట్రంప్ ను అధ్యక్షుడిగా చాలామంది ఒప్పుకోవడం లేదంటూ మీడియా ప్రచారం చేసింది.ఇదిలాఉంటే ట్రంప్ వ్యవహార శైలిపై అమెరికన్స్ నిరుశ్చాహంగా ఉన్నారని, అపజయాన్ని గౌరవంగా ఒప్పుకుంటే ట్రంప్ కే మంచిదని విశ్లేషకులు సూచనలు చేస్తున్నారు.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు