Gujarat Assembly Election : రేపే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్..!!

ఇటీవల గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.రెండు దఫాలుగా జరిగిన ఈ ఎన్నికలలో .

ప్రధానంగా బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ నెలకొంది.మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు రెండు దఫాలుగా జరిగిన ఈ ఎన్నికలకి .ఓట్ల లెక్కింపు కోసం 32 కేంద్రాలను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేయడం జరిగింది.రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.

గుజరాత్ లో అధికారం చేపట్టాలి అంటే మెజారిటీ మార్క్ 92 స్థానాలు.అయితే జరిగిన ఎన్నికలలో ఎగ్జిట్ పోల్స్ బట్టి బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేశాయి.

ఇదే జరిగితే మాత్రం గుజరాత్ లో వరుసగా బీజేపీ ఏడోసారి గెలిచినట్లు అవుతుంది. ఇదిలా ఉంటే ఈరోజు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో.

Advertisement

ఆమ్ ఆద్మీ పార్టీ విజయభేరి మోగించింది.ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో గత 15 ఏళ్లుగా బీజేపి గెలుస్తూ వచ్చింది.

ఈసారి బీజేపీని ఓడించి ఆమ్ ఆద్మీ పార్టీ గెలవటంతో.ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది.

Advertisement

తాజా వార్తలు