హరితహారం మొక్కలు అగ్నికి ఆహుతి

నల్లగొండ జిల్లా:మర్రిగూడ మండలం( Marriguda )లోని సరంపేట నుంచి లెంకలపల్లికి వెళ్లే మార్గంలోని హరితహారం( Harithaharam) మొక్కలు సోమవారం అగ్నికి ఆహుతయ్యాయి.

హరితహారం కార్యక్రమంలో భాగంగా రోడ్డుకి ఇరువైపులా నాటిన మొక్కలు కొందరు రైతులు,బాటసారుల, వాహనదారుల తప్పిదాలతో మొక్కలు మంటల్లో కాలిపోతున్నా సంబధిత అధికారులు స్పందించడం లేదని స్థానికులు వాపోతున్నారు.

మొక్కల చుట్టూ ముళ్ల కంపలు,గడ్డి తొలగించకపోవడంతో రైతులు పొలాల్లోని చెత్తాచెదారం,ముళ్ల కంపలు తగులబెట్టే క్రమంలో,పాదచారులు వేసే నిప్పులకు మంటలు చెలరేగి మొక్కలు దగ్ధమవుతున్నాయని అంటున్నారు.దీంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరకపోవడంతో పాటు ప్రజాధనం వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా అధికారులు స్పందించి మిగిలిన మొక్కలకైనా రక్షణ కల్పించాలని,వాటిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందంటున్నారు.

సంస్కరణల సాధకుడు మన్మోహన్ సింగ్ : ఎమ్మేల్యే వేముల వీరేశం
Advertisement

Latest Nalgonda News