గ్రామ పంచాయతీ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలి

యాదాద్రి భువనగిరి జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేసి, వారి కుటుంబాలను ఆదుకోవాలని తుర్కపల్లి మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్ డిమాండ్ చేశారు.

మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా బిబిపేట గ్రామ పంచాయతీ కార్మికుడు కొంగరి బాబు గత ఆరు నెలలుగా వేతనాలు రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమన్నారు.

అతి తక్కువ వేతనాలతో గ్రామాలను కాపాడుతున్న కార్మికులను పాలక ప్రభుత్వాలు,ప్రజా ప్రతినిదులు నెలనెలా కనీస వేతనం ఇచ్చి గౌర వించాలని కోరారు.లేనిపక్షంలో గ్రామ పంచాయతీ కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కోట సురేష్,ఓర్సు బిక్షపతి, నల్ల బాలకృష్ణ,పిడుగు రమేష్,భూక్యా రమేష్ నాయక్ తదతరులు పాల్గొన్నారు.

కొత్త కార్యాలయంలోకి అడుగు పెట్టిన కాంగ్రెస్ పార్టీ
Advertisement

Latest Press Releases News