బెజవాడ దుర్గమ్మ భక్తులకు శుభవార్త చెప్పిన పాలకమండలి.. ఇప్పటినుంచి భక్తులకు..?

ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మ ఆలయ పాలకమండలి సమావేశం జరిగింది.

చైర్మన్ కర్నాటి రాంబాబు( Karnati Rambabu ) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే పాలక మండలి సభ్యులు, ఈవో భ్రమరాంబ, ఇతర అధికారులు, ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.అలాగే దేవాలయ అభివృద్ధి పనులు త్వరలో చేపట్టే కార్యక్రమాల అమలు, భక్తులకు మెరుగైన వసతుల కల్పనతో పాటు అజెండాలోని పలు అంశాలపై చర్చించి పలక మండలిలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Governing Body Good News To Bejawada Durgamma Devotees Details, Bejawada Durgamm

ముఖ్యంగా చెప్పాలంటే మే 30 నుంచి ప్రతి రోజు 3 వేల నుంచి 4 వేల మందికి అన్నదానం చేయాలని,అలాగే శని, ఆదివారాలలో 5000 మందికి అన్నదానం( Annadanam ) చేయాలని నిర్ణయం తీసుకున్నారు.ఇంకా చెప్పాలంటే రాత్రి సమయంలో దేవాలయానికి( Vijayawada Kanakadurga Temple ) వచ్చే భక్తులకు కూడా ఇప్పటి నుంచి అన్న ప్రసాదం పెట్టాలని పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది.దుర్గ ఘాట్ ఆధునికరణ, ప్రతి పౌర్ణమికి తొమ్మిది కిలో మీటర్ల గిరి ప్రదక్షణకు బస్సు సౌకర్యం కల్పించేందుకు నిర్ణయించారు.

ప్రొవిజన్స్ స్టోరేజ్ కోసం కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు.

Governing Body Good News To Bejawada Durgamma Devotees Details, Bejawada Durgamm
Advertisement
Governing Body Good News To Bejawada Durgamma Devotees Details, Bejawada Durgamm

అమ్మవారి దర్శన సమయం లో వృద్ధులకు, వికలాంగులకు వీల్ చైర్లు ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు.కొండ దిగువన ఉన్న అర్జిత సేవా టికెట్ల విక్రయాల కేంద్రాలు ఏర్పాటు చేయాలని పాలక మండలి తీర్మానించింది.ఇంకా చెప్పాలంటే బెజవాడలో శ్రీ చక్ర అధిష్టాన దేవత దుర్గమ్మగా వెలిసింది.

భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారం గా వీరాజిల్లుతూ ఉంది.ఈ దుర్గా గుడి క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి వేకువ జామున నాలుగు గంటల నుంచి 9 గంటల వరకు అమ్మ వారిని దర్శనం చేసుకునే సౌలభ్యం ఉంటుంది.

ముఖ్యంగా చెప్పాలంటే మధ్యాహ్నం భోజన విరామం సమయంలో కాసేపు దర్శనాన్ని నిలిపివేస్తారని దేవాలయ అధికారులు వెల్లడించారు.

పిస్తా పాలు తాగితే ఎన్ని ఆరోగ్య లాభాలో తెలుసా?
Advertisement

తాజా వార్తలు