మహానటి సావిత్రి( Mahanati Savitri ) .ఆమె ఎక్కడ ఉంటె అక్కడ నవ్వులే.
ఆమె ఏం చేసిన అదొక వింతే.ఎన్నో వందల సినిమాల్లో నటించిన కూడా సెట్ లో అందరితో చాల సరదాగా ఉండేవారు.
మద్యం అలవాటు అయ్యే వరకు కూడా ఆమె వ్యాపకం సెట్ లో ఉంటె కేవలం పేకాట మాత్రమే.అన్న గారు ఎన్టీఆర్ ( Sr NTR )నుంచి ఎంతో మంది నటులు ఆమెతో నటించడానికి సుముఖత చూపించేవారు.
ఒక్కో హీరోతో పదుల సంఖ్య లో సినిమాలో తీసిన సావిత్రి ఆమె తో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అనుకుంటూ ఉండేది.అయితే ఎన్టీఆర్ తో ఆమె ఎక్కువ సినిమాల్లో నటించింది.
ఆమె లావుగా ఉన్న కూడా ఎన్టీఆర్ ఆమెను మాత్రమే హీరోయిన్ గా పెట్టుకోవడానికి ఇష్టపడేవారు.

మనిషి లావు అయితే ఏంటండీ మొహం మీద ఫ్రేమ్ పెట్టండి సినిమా విజయం సాధిస్తుంది అనే వారు అప్పట్లో ఎన్టీఆర్.ఇలా అయన చనువు తీసుకొని ఆమెతోనే సినిమాలు తీయడం వల్ల వాళ్ళిద్దరి మధ్య ఎదో ఉందంటూ అప్పుతో ఒక నిర్మాత పుకారు( Producer ) సృష్టించాడట.అది ఆ నోటా ఈ నోటా అటు సావిత్రి కి ఇటు ఎన్టీఆర్ కి తెలిసిపోయింది.
దాంతో ఎన్టీఆర్ కి చాల కోపం వచ్చింది.నాకు చెల్లి సమానురాలైన సావిత్రి తో ఇలాంటి ఒక నీచమైన బంధం అంటగడతారా అంటూ మండిపడ్డారట.
పైగా ఆమెను సావిత్రమ్మ అంటూ పిలిచే నేను అలాంటి తప్పు చేస్తానా అంటూ చిరాకు పడ్డారట.ఇక సావిత్రి అయితే విషయం తెలియగానే శివాలు ఎత్తిపోయారట.
ఈ వార్త ఎక్కడ పుట్టిందా అని తెలుసుకొని సరాసరి ఆ నిర్మాత ఇంటికి వెళ్లి మరి ఉతికి ఆరేశారట.

నీకు అక్క చెల్లెల్లు లేరా? ఆడదానిపై ఇలాంటి పుకార్లు పుట్టిస్తారా అంటూ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారట.ఇలా సావిత్రి నిర్మాతకు చివాట్లు పెట్టిన విషయం ఇండస్ట్రీ మొత్తం తెలిసిపోయింది.అబ్బో సావిత్రి మహా గడుసు పిల్ల అంటూ అప్పటి నుంచి అలాంటి చెత్త వార్తలు రాయకుండా జాగ్రత్త పడేవారట.
ఇలా ఆమె ఉగ్ర రూపం చూపించి సినిమా వారంటే అంత సులువు కాదు అని నిరూపించుకుంది.అయితే ఆమె తో ఒక సినిమా తీసి నష్టపోయిన ఒక నిర్మాత చేసిన పని ఇది.