షూటింగ్ లో గాయపడ్డ స్టార్ హీరో..!

మ్యాచో స్టార్ గోపీచంద్ ప్రస్తుతం శ్రీవాస్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు.

మైసూర్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ లో హీరో గోపీచంద్ స్లిప్ అయ్యి కిందపడ్డారని తెలుస్తుంది.

యాక్షన్ సీన్ చేస్తున్న టైం లో ఈ ఇన్సిడెంట్ జరిగినట్టు తెలుస్తుంది.వెంటనే ఆయన్ను దగ్గర్లో ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్లారు.

అయితే గోపీచంద్ కి గాయాలు అనగానే ఫ్యాన్స్ కంగారుపడ్డారు.చిత్రయూనిట్ కంగారు పడాల్సింది ఏమి లేదని హీరోకి ఎలాంటి గాయాలు తగల్లేదని క్లారిటీ ఇచ్చారు.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా తో హ్యాట్రిక్ హిట్ కు సిద్ధమయ్యారు శ్రీవాస్, గోపీచంద్.ఆల్రెడీ ఈ కంబినేషన్ లో వచ్చీ లక్ష్యం, లౌఖ్యం సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.

Advertisement

మరోసారి ఈ హిట్ కాంబో రిపీట్ చేస్తూ అదే ఫలితాన్ని పొందాలని చూస్తున్నారు.ఇక ఈ సినిమాతో పాటుగా మారుతి డైరక్షన్ లో కూడా గోపీచంద్ నటిస్తున్నారు.

పక్కా కమర్షియల్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో గోపీచంద్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది.కొన్నాళ్లుగా సరైన హిట్ అందుకోని గోపీచంద్ ఈ రెండు సినిమాలతో హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు