Google Office Pune : వీడియో: పూణెలో కొత్తగా గూగుల్ ఆఫీస్.. అందులోని సౌకర్యాలు చూస్తే మతిపోతుంది..

టెక్ దిగ్గజం గూగుల్( Google ) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.సెర్చ్ ఇంజన్, వివిధ రకాల యాప్స్, సర్వీస్‌లను గూగుల్ ఆఫర్ చేస్తుంది.

ఇంటర్నెట్‌ను వాడే ప్రతి ఒక్కరూ గూగుల్ అందించే ఏదో ఒక సర్వీస్ వాడుతూనే ఉంటారని చెప్పుకోవచ్చు.ఇంత పెద్ద కంపెనీలో ఉద్యోగం తెచ్చుకోవడం చాలా కష్టమని కూడా చెప్పవచ్చు.

గూగుల్‌కి భారతదేశంలోని వివిధ ప్రదేశాలలో ఆఫీస్‌లు ఉన్నాయి.ఇటీవల గూగుల్ పూణెలోని( Pune ) కోరేగావ్ పార్క్ అనెక్స్ అనే ప్రదేశంలో కొత్త ఆఫీస్ ప్రారంభించింది.

కొత్త ఆఫీసులో పనిచేసేవాళ్లు చాలా స్మార్ట్, ఎడ్యుకేటెడ్ అని చెప్పుకోవచ్చు.ఇంటర్నెట్ కోసం కొత్త ప్రొడక్ట్స్ డెవలప్ చేయడానికి వివిధ దేశాల నుంచి ఇతర తెలివైన వ్యక్తులతో కలిసి పని చేస్తారు.

Advertisement
Google Employee Gives A Tour Of Company Newly Opened Office In Pune-Google Offi

ఇతర వ్యక్తులు ఈ విషయాలను మెరుగ్గా ఉపయోగించుకోవడంలో కూడా వారు సహాయపడతారు.కొత్త కార్యాలయంలో 1,300 మంది కంటే ఎక్కువ మంది కూర్చుంటారు.

Google Employee Gives A Tour Of Company Newly Opened Office In Pune

కొత్త ఆఫీస్‌లో( Google New Office ) పని చేస్తున్న వారిలో ఒకరైన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అర్ష్ గోయల్( Arsh Goyal ) ఇన్‌స్టాగ్రామ్‌లో తన కొత్త ఆఫీస్‌కు సంబంధించిన వీడియో షేర్ చేశాడు.ఆఫీసులో కేఫ్, గేమ్ జోన్, రిక్రియేషన్ రూమ్, బ్యూటిఫుల్ డెకరేషన్ లను చూపించాడు.అవి చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

కొత్త ఆఫీస్ చాలా బాగుందని, అక్కడ పని చేయాలనుకుంటున్నామని కొందరు చెప్పారు.

Google Employee Gives A Tour Of Company Newly Opened Office In Pune

గూగుల్‌కు భారతదేశంలో మరో నాలుగు ఆఫీస్‌లు ఉన్నాయి.అందులో ఒకటి తెలంగాణలోని ప్రధాన నగరమైన హైదరాబాద్‌లో( Hyderabad ) ఉంది.ఇతర కార్యాలయాలు బెంగళూరు, గుర్గావ్, ముంబైలో ఉన్నాయి.

రక్తపు మరకల దుస్తులతోనే తండ్రికి కూతురు అంత్యక్రియలు.. వీడియో చూస్తే కన్నీళ్లాగవు..
ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల.. పైచేయి సాధించిన అమ్మాయిలు..!

అద్భుతమైన సౌకర్యాలతో చాలామంది దృష్టిని పెట్టుకుంటున్నాయి.ఒక సంవత్సరమైనా ఇలాంటి ఆఫీసుల్లో పనిచేసే అదృష్టం లభిస్తే ఎంత బాగుంటుంది అని చాలామంది నిరుద్యోగులు కామెంట్లు చేస్తుంటారు.

Advertisement

తాజా వార్తలు