వింత ప్రాణి కి జన్మనిచ్చిన మేక.... నిర్మల్ జిల్లా లో

ప్రపంచం లో ఏడు వింతలు ఉన్నాయ్ అని అంటారు.కానీ ఈ దైనందిన జీవితంలో నిత్యం ఎక్కడో చోట ఎదో ఒక వింత జరుగుతూనే ఉంది.

చాన్నాళ్ల క్రితం ఆవుకు వింత ప్రాణి జన్మించింది అని, అలానే ఒక స్త్రీ కి వింత శిశువు జన్మించింది ఇలా చాలా వింతలే చోటుచేసుకున్నాయి.అయితే ఇప్పడు తాజాగా నిర్మల్ జిల్లా లో కూడా మేక ఒక వింత ప్రాణికి జన్మనిచ్చింది.

నిర్మల్ జిల్లా తానూర్ మండలం లోని కొల్లూర్ తాండా లో పవార్ సోపానం అనే రైతుకు చెందిన మేకకు వింత ప్రాణి పుట్టింది.ఆ వింత ప్రాణి తల చాలా పెద్దదిగా,శరీరం చిన్నది గా పుట్టింది.

అంతేకాకుండా ఆ ప్రాణి శరీరం పూర్తిగా ఆకృతి కూడా దాల్చలేదు.దీనితో ఆ వింత ప్రాణిని చూడడానికి వూరు ఊరంతా కూడా అక్కడకి తరలివెళుతున్నారు.

Advertisement

ఇటీవల ఒక ఆవు దూడ కుక్కలా,మనిషి లాగా వింతగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే.అయితే ఇంకా ఆ వింత మరువక ముందే ఇప్పుడు నిర్మల్ జిల్లా లో మేక ఈ వింత ప్రాణి కి జన్మనిచ్చింది.

అయితే మేక ఆరోగ్యంగానే ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు