కరోనా బారిన పడ్డ మరో సీఎం..!

సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ప్రతి ఒక్కరిని హడలెత్తిస్తున్న అంశం కరోనా.

ఎప్పుడు ఎవరికి,ఎలా ఈ కరోనా సోకుతుందో అన్న విషయం ఎవ్వరికీ అర్ధం కావడం లేదు.

గత ఆరు నెలలుగా దేశంలో ఏర్పడ్డ కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రజా ప్రతినిధులు సైతం వరుసగా కరోనా బారిన పడుతున్నారు.కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో పాటు పలువురు కేంద్ర మంత్రులు కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే.

Goa CM Pramod Sawant Tested Corona Positive, Goa CM Pramod Sawant, Home Isolatio

అలానే మధ్యప్రదేశ సీఎం చౌహన్,కర్ణాటక సీఎం,హర్యానా సీఎం ఇలా పలువురు కరోనా బారినపడగా,తాజాగా గోవా సీఎం ప్రమోద్ సావంత్ కూడా ఈ మహమ్మారి బారిన పడినట్లు తెలుస్తుంది.ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు.

అయితే ఆయనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని కావున వైద్యుల సూచన మేరకు హోం ఐసోలేషన్ లో ఉంటున్నట్లు ఆయన వెల్లడించారు.ఇంటి నుంచే తన కార్యకలాపాలు కొనసాగిస్తానని తెలిపిన ఆయన ఇటీవల తనను కలిసిన వారంతా కూడా కోవిడ్ పరీక్షలు చేయించుకొని,కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Advertisement
సుప్రీం కోర్టు పార్కింగ్‌లో లగ్జరీ కార్లు.. లాయర్ల రేంజ్ చూస్తే దిమ్మతిరగాల్సిందే!

తాజా వార్తలు