హన్మాజీపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వైభావంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు!

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొన్నారు.

ముఖ్యంగా విద్యార్థినిలు రంగురంగుల పూలతో బతుకమ్మలు పేర్చి కోలాటం ఆడుతూ చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాణాల మల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు అని భగవంతుని పువ్వులతో పూజిస్తాం మరి పూలనే పూజించే గొప్ప సంస్కృతి బతుకమ్మ పండుగ అని విద్యార్థిని విద్యార్థులకు తెలియజేశారు.ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అధ్యాపక బృందానికి బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.

పాఠశాలలో జరిగిన ముందస్తు బతుకమ్మ వేడుకలలో ఉపాధ్యాయులు కృష్ణహరి, శ్రీనివాస్, నరేష్, రేఖ, మౌనిక, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఘనంగా గాంధీ జయంతి వేడుకల నిర్వహణ
Advertisement

Latest Rajanna Sircilla News