నెయ్యి వ‌ర్సెస్‌ వెన్న.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్?

నెయ్యి,( Ghee ) వెన్న‌.( Butter ) ఇవి రెండు పాలు నుంచి త‌యార‌య్యే ఉత్ప‌త్తులే.

అయితే కొంద‌రు నెయ్యి మంచిదంటే.ఇంకొంద‌రు వెన్న మంచిద‌ని అంటున్నారు.

అస‌లు నెయ్యి మ‌రియు వెన్న‌లో ఆరోగ్యానికి ఏది బెస్ట్ అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.నెయ్యి, వెన్న రెండింటిలోనూ కొవ్వు అధికంగా ఉంటుంది, అయితే వాటి పోషక విలువలు మ‌రియు ఆరోగ్య ప్రయోజనాల్లో కొంత వ్యత్యాసం ఉంటుంది.

నెయ్యిలో శుద్ధి చేయబడిన కొవ్వు ఎక్కువగా ఉంటుంది.ఇది మెట‌బాలిజాన్ని మెరుగుపరుస్తుంది.

Advertisement

వెన్నలోనూ నెయ్యిలాగే కొవ్వు అధికంగా ఉంటుంది, కానీ ఇందులో కొంత మేర ట్రాన్స్ ఫ్యాట్, సాచ్యురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది.ఇవి గుండె సమస్యలకు కారణమవుతాయి.

అలాగే నెయ్యి వెన్న నుంచి తయారు అయ్యే క్ర‌మంలో లాక్టోస్, కేసిన్ తొలగిపోతాయి.దీంతో లాక్టోస్ అలర్జీ ఉన్నవారు కూడా నెయ్యి తినవచ్చు.

కానీ వెన్న‌లో లాక్టోస్, ప్రోటీన్ కేసిన్ ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని మందికి మైగ్రేన్, ఫుడ్ అలర్జీలు, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

నెయ్యి జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది.అలాగే గుండె ఆరోగ్యానికి( Heart Health ) అండంగా నిలిచే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలను మ‌నం నెయ్యి ద్వారా పొందొచ్చు.నెయ్యిలో విట‌మిన్ డి, విట‌మిన్ ఎ, విట‌మిన్ ఇ, విట‌మిన్ కె వంటి ముఖ్య‌మైన పోష‌కాలు కూడా ల‌భిస్తాయి.

Dandruff Homemade Serum : ఈ హోమ్‌ మేడ్ సీర‌మ్ ను వాడితే డాండ్రఫ్ అన్న మాటే అన‌రు!

వెన్న విష‌యానికి వ‌స్తే.నెయ్యితో పోలిస్తే ఇది ఎక్కువ సహజసిద్ధమైన రూపంలో ఉంటుంది.

Advertisement

శరీరానికి అవసరమైన విటమిన్లను అందిస్తుంది.

ఇక ఆరోగ్యపరంగా వెన్న కంటే నెయ్యి మెరుగైన ఎంపిక అన‌డంలో ఎటువంటి సందేహం లేదు.నెయ్యి జీర్ణానికి మంచిది, గుండెకు మేలు చేసే ఒమేగా-3 అందిస్తుంది, అంతేకాకుండా లాక్టోస్ అలర్జీ ఉన్నవారు సైతం నెయ్యి తినవచ్చు.అలా అని వెన్న చెడ్డ‌ది అని చెప్ప‌డం లేదు.

ఇది సహజమైన పాల ఫ్యాట్, సహజ రుచిని కలిగి ఉంటుంది.కానీ ఎక్కువగా తింటే గుండె సమస్యలు వచ్చే అవకాశముంది.

కొలెస్ట్రాల్ సమస్యలు లేకపోతే కొద్దిగా వెన్న కూడా తీసుకోవచ్చు.

తాజా వార్తలు