ఇన్‌స్టాగ్రామ్‌ను ఊపేస్తున్న నెయ్యి తయారీ వీడియో.. కొంత సమయంలోనే 2.4 కోట్ల వ్యూస్...

ఇండియాలో నెయ్యిని( Ghee in India ) వివిధ రకాల వంటకాల్లో విరివిగా వాడుతుంటారు.ఇది వెయ్యి సంవత్సరాలకు పైగా వంటలో ఒక భాగంగా మారిపోయింది.

నూనెలకు బదులు చాలామంది నెయ్యి వాడుతుంటారు.నెయ్యి వల్ల ఆరోగ్యం ఇంప్రూవ్ అవ్వడమే కాక చాలా టేస్ట్ కూడా లభిస్తుంది.

చాలా మంది ఇంట్లో తయారుచేసిన నెయ్యి ఉత్తమమని భావిస్తారు, కానీ దానిని దుకాణంలోనే కొనుగోలు చేస్తారు, ఎందుకంటే ఇంట్లో నెయ్యి తయారు చేయడం సాధారణంగా చాలా సమయంతో కూడుకున్న పని.అందుకు ముందుగా రోజూ పాల నుంచి మీగడను సేకరించి, నెయ్యి తయారయ్యే వరకు ఆ మీగడను నెమ్మదిగా ఉడకబెట్టాలి.ఈ ప్రాసెస్ చాలా కష్టంగా ఉంటుందని ఆడవారు దీని జోలికి వెళ్ళరు.

Ghee Making Video Which Is Rocking Instagram 2.4 Crore Views Within A Short Time

కానీ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లోని ఒక వీడియో నెయ్యి తయారీకి కేవలం పది నిమిషాలు పట్టే ఓ కొత్త పద్ధతిని చూపించింది.పది నిమిషాల్లో ప్రెషర్ కుక్కర్‌లో నెయ్యి తయారు చేయొచ్చు అంటూ షిప్రా కేసర్వాణి( Shipra Kesarvani ) ఈ వీడియో రూపొందించారు.క్రీమ్ నుంచి నెయ్యి తయారు చేసే సాంప్రదాయ పద్ధతి కంటే ఇది చాలా సులభమని చెప్పారు.

Advertisement
Ghee Making Video Which Is Rocking Instagram 2.4 Crore Views Within A Short Time

వీడియోలో, ఆమె ప్రెషర్ కుక్కర్‌లో కొంచెం నీరు, మిల్క్ మీగడ క్రీమ్‌ను ఉంచారు.క్రీమ్ చల్లగా లేదా గది ఉష్ణోగ్రత వద్ద ఉండాలని ఆమె చెప్పింది.ఆపై ఆమె దానిని అధిక వేడి మీద ఉడికించింది.

తర్వాత, ఆమె క్రీమ్‌లో కొద్దిగా బేకింగ్ సోడా( Baking soda ) వేసి తిప్పింది.ఇలా చేస్తే ఐదు నుంచి ఏడు నిమిషాల్లో నెయ్యి ఘనపదార్థాల నుంచి విడిపోతుందని తెలిపింది.

Ghee Making Video Which Is Rocking Instagram 2.4 Crore Views Within A Short Time

ఈ వీడియోను పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే వైరల్‌గా మారింది.దీనికి 2.4 కోట్లకు పైగా వ్యూస్ 2 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి.చాలా మంది ఈ పద్ధతిలో నెయ్యి చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పారు.

కానీ కొంతమందికి ఈ మెథడ్ వర్కౌట్ అవుతుందా అని అనుమానం వ్యక్తం చేశారు.నెయ్యి నాణ్యత కోల్పోతుందోనని ఆందోళన చెందుతున్నారు.

అక్కినేని ఫ్యామిలీ నుంచి స్టార్ హీరో రాలేడా..?
నాగార్జున విషయంలో ఎందుకిలా జరుగుతుంది...

బేకింగ్ సోడా వేయాల్సిన అవసరం లేదని కూడా వారు భావిస్తున్నారు.కొందరైతే ఇది చక్కటి ఉపాయం అని అంటే , మరికొందరు సరైన పద్ధతిలో నెయ్యి తయారు చేస్తే మంచిదని, ఆరోగ్యకరమని అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు