దారుణం.. మూత్రం పోసిన చపాతీలను చేసి యజమాని కుటుంబానికి పెట్టిన పనిమనిషి

మనలో చాలా మంది వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా పనుల ఒత్తిడితో ఇంట్లో పనులు చేసుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు.

ఈ క్రమంలో కొంత మంది వారి ఇంట్లో పనులు చేయించుకోవడానికి పని మనుషులను పెట్టుకోవడం సర్వసాధారణం అయిపోయింది.

ఈ క్రమంలో పని మనుషులుగా చేస్తున్నవారు ఎలాంటి దారుణాలకు పాల్పడతారో కూడా ఒక్కోసారి యజమానులకు అంతు చిక్కడం లేదు.అచ్చం అలాంటి సంఘటనే ఒకటి ఢిల్లీకి దగ్గరలో ఉన్న ఘజియాబాద్ లో( Ghaziabad ) చోటు చేసుకుంది.

ఒక ప్రముఖ వ్యాపారవేత ఇంట్లో పని మనిషిగా( Maid ) చేస్తున్న ఒక మహిళ తన మూత్రంతో( Urine ) కలిపిన చపాతీ పిండికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.

Ghaziabad Maid Mixes Urine In Dough To Make Rotis Caught Red-handed Viral Video

వీడియో బయటపడిన అనంతరం వెంటనే ఆ ప్రముఖ వ్యాపారవేత క్రాసింగ్ రిపబ్లిక్ పోలీస్ స్టేషన్ లో పనిమనిషిపై కేసు నమోదు చేశాడు.దాంతో నిందితురాలును వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు మొదలుపెట్టారు.ఆ పనిమనిషి తన ఇంట్లో 8 సంవత్సరాలుగా ఆహారం వండి పెడుతుందని ప్రముఖ వ్యాపారి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తుంది.

Advertisement
Ghaziabad Maid Mixes Urine In Dough To Make Rotis CAUGHT Red-Handed Viral Video

ఆ పనిమనిషి చేసిన ఆహారం తిని తన కుటుంబం కాలేయ సమస్యలతో బాధపడుతుందని.ఇప్పటికి వరకు అతనికి ఎటువంటి అనుమానం రాలేదని తెలిపాడు.కానీ.

, ఇంట్లో వంటగదిలో( Kitchen ) ఉల్లిపాయలు, బంగాళదుంపలు, టమోటాలు ఇలా పలు వస్తువులు దొంగలించడం ప్రారంభమైందని, దీంతో పనిమనిషిపై అనుమానం రావడంతో.ఆమె రాక ముందుకే మొబైల్ కెమెరా ఆన్ చేసి వంటగదిలో పెట్టినట్లు తెలిపారు.

Ghaziabad Maid Mixes Urine In Dough To Make Rotis Caught Red-handed Viral Video

ఈ క్రమంలో పనిమనిషి పని ముగించుకొని వెళ్ళిన తర్వాత ఆ వీడియోను చూసినట్లు బాధితులు తెలియజేశాడు.ఇంతకీ ఆ వీడియోలో ఏముందన్న విషయానికి వస్తే.వంటగదిలో ప్రవేశించిన ఆ పని మనిషి కాసేపు తర్వాత ఒక పాత్రలో మూత్రం పోసి అదే మూత్రంతో చపాతీ పిండిని కలిపి రోటీలు తయారు చేయడం స్పష్టంగా చూడవచ్చు.

అనంతరం పిల్లలకు టిఫిన్ బాక్స్ లో పెట్టడం, అలాగే ఇంట్లో వారు తినడానికి అక్కడే పెట్టింది.వంట గది నుంచి బయటికి వెళ్లేటప్పుడు ఉల్లిపాయలు, టమాటాలు, బంగాళాదుంపలు ఇలా కొన్ని పదార్థాలు సంచిలో పెట్టుకొని బట్టలలో దాచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది.

ఈ రెండు ఉంటే చాలు పైసా ఖర్చు లేకుండా వైట్ అండ్ గ్లాస్ స్కిన్ ను పొందొచ్చు!
జర్మనీ బీచ్‌ల‌లో షాకింగ్ రూల్స్.. బట్టలు వేసుకుంటే ఇక గెంటేస్తారట..?

పనిమనిషి అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వెంటనే ఆ వీడియోని చూసి బాధితుడు పాఠశాలకు వెళ్తున్న పిల్లలను పిలిచి టిఫిన్ బాక్స్ లో ఉన్న ఆహారాన్ని పడేయమని తెలియజేశాడు.ఈ సంఘటనపై క్రాసింగ్ రిపబ్లిక్ పోలీస్ స్టేషన్( Crossing Republic Police Station ) అధికారులు మేరకు మహిళ ముందుగా ఈ సంఘటన గురించి నాకు ఏమి తెలియదు అని చెప్పగా.

Advertisement

చివరికి ఆమెకు వీడియో చూపించిన తర్వాత తప్పు ఒప్పుకుందని తెలిపారు.కానీ., ఇలా చేయడానికి గల కారణం మాత్రం తెలియచేయలేదు.

ఇంక మరోవైపు ప్రముఖ వ్యాపారవేత పనిమనిషి తన మూత్రంతో చేసిన ఆహారాన్ని వారికి ఎంతకాలం నుంచి తినిపిస్తుందోనని అర్థమవ్వడం లేదంటూ పేర్కొన్నాడు.

తాజా వార్తలు