అమెరికా: జనరల్ అట్లాంటిక్ వైస్ ఛైర్మన్‌గా అజయ్ బంగా.. !!!

సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ సీఈవోగా నియమితులైన పరాగ్ అగర్వాల్ పేరు ఇప్పుడు భారత్‌తో పాటు ప్రపంచమంతా మార్మోగిపోతోంది.

ఇప్పటికే ప్రతిష్ఠాత్మక టెక్ దిగ్గజ సంస్థలు గూగుల్, ఐబీఎం, మైక్రోసాఫ్ట్, అడోబ్‌లకు భారత సంతతి వ్యక్తులు అధిపతులుగా ఉండగా.

ఇప్పుడు పరాగ్ అగర్వాల్ వారి సరసన చేరి భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారు.ఈ నేపథ్యంలోనే ఆయనకు విశ్వవ్యాప్తంగా వున్న భారతీయులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

మరోవైపు ఇంకో ప్రఖ్యాత అమెరికన్ సంస్థలో భారతీయుడికి కీలక పదవి దక్కింది.అయితే ఆయన అందరికీ తెలిసిన వ్యక్తే.

గ్లోబల్ గ్రోత్ ఈక్విటీ దిగ్గజం జనరల్ అట్లాంటిక్ వైస్ ఛైర్మన్‌గా మాస్టర్ కార్డ్ మాజీ సీఈవో, భారత సంతతికి చెందిన అజయ్ బంగా నియమితులయ్యారు.ప్రపంచవ్యాప్తంగా 165కి పైగా వున్న సంస్థలకు అజయ్ బంగా సారథ్యంలోని కంపెనీ సలహాలు ఇస్తుందని జనరల్ అట్లాంటిక్ ఒక ప్రకటనలో తెలిపింది.

Advertisement

ప్రస్తుతం మాస్టర్ కార్డ్‌ సీఈవో, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆయన అమెరికాలోని భారత సంతతి కార్పోరేట్ ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరిగా భారతీయ సమాజంపై బలమైన ముద్ర వేస్తున్నారు.తన వ్యూహ చతురత, నాయకత్వ పటిమతో మాస్టర్ కార్డ్‌ను దిగ్గజ సంస్థగా తీర్చిదిద్దిన అజయ్ బంగా ఈ ఏడాది డిసెంబర్ 31న పదవీ విరమణ చేయనున్నారు.

దాదాపు ఏడాది పాటు మాస్టర్‌కార్డ్ సీఈవోగా వ్యవహరించిన అజయ్ బంగా.ఈ ఏడాది ప్రారంభంలో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ప్రమోషన్ పొందారు.మొత్తం 12 ఏళ్ల పాటు మాస్టర్ కార్డ్‌లో పలు హోదాల్లో పనిచేసిన అజయ్ బంగా వచ్చే ఏడాది జనవరి 1 నుంచి జనరల్ అట్లాంటిక్ వైస్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

నవంబర్ 10, 1959న మహారాష్ట్రలోని పూణేలో జన్మించిన అజయ్ బంగా పూర్తి పేరు.అజయ్ పాల్ సింగ్ బంగా.ఆయన తండ్రి భారత సైన్యంలో ఉన్నత అధికారి.నిజానికి వీరి స్వగ్రామం పంజాబ్‌లోని జలంధర్.

అయితే తండ్రి ఉద్యోగ రీత్యా వారి కుటుంబం తరచుగా ఇతర ప్రాంతాలకు వెళ్లేది.అజయ్ బంగా తండ్రి హర్భజన్ సింగ్ బంగా.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

లెఫ్టినెంట్ జనరల్‌గా పదవీ విరమణ పొందారు.అజయ్ బంగా విద్యాభ్యాసం సికింద్రాబాద్, జలంధర్, ఢిల్లీ, అహ్మదాబాద్, సిమ్లాలలో జరిగింది.

Advertisement

బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ప్రైమరీ విద్యను పూర్తి చేసిన ఆయన.ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్‌సన్ కాలేజ్ నుంచి ఎకనమిక్స్‌లో హానర్స్ పట్టా పొందారు.ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో పీజీపీ, అహ్మాదాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి ఎంబీఏ అందుకున్నారు.1981లో నెస్లేలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన అజయ్ బంగా.13 సంవత్సరాల పాటు వివిధ హోదాల్లో పనిచేశారు.ఆతర్వాత పెప్సీకోలో పనిచేశారు.

తాజా వార్తలు