వందల ఏళ్లుగా అదే సంప్రదాయం..ఏళ్ల తరబడి సహజీవనం చేసి.. పిల్లలు పుట్టి పెద్దాయ్యాక

సహజీవనం.నచ్చినవారితో నచ్చినంత కాలం గడపడం.

నచ్చకపోతే విడిపోవడం.

పెళ్లికి కావలసిన మూడుముళ్లు,ఏడడుగులు తప్ప అన్ని ఉంటాయి సహజీవనంలో.

పెళ్లిపట్ల విముఖత చూపుతున్న యువతని ఎక్కువగా ఆకర్శిస్తుంది లివింగ్ రిలేషన్ షిప్.ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినపడతున్న ఈ పద్దతి కొన్ని వందల ఏళ్ల క్రితం నుండే ఒక తెగకు చెందిన ప్రజలు ఫాలో అవుతున్నారు.

ఆ విశేషాలు.

Advertisement

ఎక్కువగా సెలబ్రిటీలు,డబ్బున్న వారిలోనే లివింగ్ రిలేషన్ అనేది చూస్తాం.మధ్యతరగతి, దిగువ స్థాయి వారిలో ఇలాంటివి పెద్దగా కనపడవు వినపడవు.గుజరాత్‌లోని ఓ తెగలో వందల ఏళ్లుగా సహజీవనం సాంప్రదాయంగా వస్తోంది.

గరాసియా తెగకు చెందిన అమ్మాయిలు వారికి నచ్చిన అబ్బాయిలతో సహజీవనం చేసే స్వేచ్ఛ ఉంది.వారు ఎవరితో సహజీవనం చేయాలనే విషయంలో నిర్ణయాధికారం అమ్మాయిలదే.

పెళ్లివయసు వచ్చాక అమ్మాయికి ఒకబ్బాయి నచ్చారంటే.అతని అనుమతితో సహజీవనం చేస్తారు.

ఏళ్ల తరబడి సహజీవనం చేసి.పిల్లలు పుట్టి పెద్దాయ్యాక చాలా మంది పెళ్లి చేసుకుంటారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

ముఖ్యంగా ఆర్థికంగా నిలదొక్కుకున్నామని అనిపిస్తేనే పెళ్లి చేసుకోవడం అనాదిగా వస్తోంది.

Advertisement

ఒకసారి సహజీవనం మొదలుపెట్టిన తర్వాత ఆ అబ్బాయి జీవితాంతం ఆమెతోనే కలిసి ఉండాలి.మరొకరితో సహజీవనం చేయకూడదు.పైగా ప్రతినెల ఆ మహిళకు డబ్బులు ఇవ్వాలి.

పెళ్లి ఖర్చులు అబ్బాయి తరఫు వారే పూర్తిగా భరించాలి.ఈ తెగలో ఎక్కువ శాతం 60, 70 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంటారు.

రాజస్థాన్‌లోని పాలి, సిరాహి, ఉదయ్‌పూర్‌ జిల్లాల్లో ఈ తెగవారు ఎక్కువగా నివసిస్తారు.మరో ముఖ్యవిషయం ఈ తెగలో గృహహింస, వరకట్నాలు, అత్యాచారాలు ఉండవు.

తాజా వార్తలు