గంభీరావుపేట్ మండల అఖిలపక్షం కమిటీ ఆధ్వర్యంలో "ఎల్లారెడ్డిపేట్ సబ్ రెవిన్యూ డివిజన్ కేంద్రంగా" ప్రకటించాలని కోరుతూ సమావేశం..

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో అఖిలపక్ష కమిటీ సమావేశం ఎల్లారెడ్డిపేట్ రెవిన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎల్లారెడ్డిపేట రెవిన్యూ డివిజన్ సాధన కమిటీ కన్వీనర్ ఒగ్గు బాలరాజు యాదవ్ హాజరవడం జరిగింది.

ఈ సమావేశంలో గంభీరావుపేట్ మండల అఖిలపక్ష కమిటీ కన్వీనర్ గా యారపు రాజాబాబు ని, ప్రచార కార్యదర్శిగా దోమకొండ కృష్ణ కాంత్ యాదవ్ ని, ప్రణాళిక కమిటీ సభ్యునిగా మంగలి చంద్రమౌళి నీ ప్రకటించడం జరిగింది.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నుకోబడిన కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట్ సబ్ డివిజన్ కావడం వల్ల ప్రజలకు ఇబ్బందులు తీరుతాయని, సిరిసిల్ల జిల్లా కేంద్రం వెళ్లడం వల్ల ప్రజలకు వ్యాయా ప్రయాసాలు, దూర బారం, సమయపాలన తగ్గుతుందని అన్నారు.

ఎల్లారెడ్డిపేట్ రెవెన్యూ డివిజన్ గా ప్రభుత్వం ప్రకటించేంతవరకు పోరాడుతామని వారు అన్నారు.ఈ విషయంపై భవిష్యత్తు ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని మేధావివర్గం, అన్ని రాజకీయ పార్టీ నాయకులు, అన్ని కుల సంఘ నాయకులు, ప్రజాసంఘ నాయకులు, ఉద్యమ నాయకులు, విద్యార్థులు, సంఘాల నాయకులు లోతుగా ఆలోచించి, రెవిన్యూ డివిజన్ సాధించడానికి మద్దతుగా రావాలని కోరడం జరిగింది.

ఈ కార్యక్రమంలో దోశల ఉపేందర్, భాస్కర్, రవీందర్ ,సురేష్, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
మరుపురాని మహమనిషి ఎన్టీఆర్ - మోతె రాజిరెడ్డి

Latest Rajanna Sircilla News