వైస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించి వేగంగా అడుగులు వేస్తూ, పార్టీ పేరు ప్రకటించిన తర్వాత అన్ని అవకాశాలు తమకు అనుకూలంగా ఉండే విధంగా చేసుకుంటూ ముందుకు వస్తున్నారు.ఇప్పటికే వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితులైన తెలంగాణ నాయకులు అందరితోనూ ఆమె ఓ సారి సమావేశం నిర్వహించారు.
ఇక జిల్లాల వారీగా వైఎస్ అభిమానులతో షర్మిల మంతనాలు చేస్తున్నారు.ఈ రోజు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన దాదాపు 700 మంది కీలక నాయకులతో ఆమె ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.
పార్టీ ఏర్పాటుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా చేపట్టే విధంగా షర్మిల ముందుకు వెళ్తున్నారు.బహిరంగంగా కొంతమంది కీలక నాయకులతో మంత్రాలు చేస్తూనే తెలంగాణలోని మరి కొంతమంది కీలక వ్యక్తులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులతో రహస్యంగా సమావేశం నిర్వహిస్తూ, తన రాజకీయానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకుంటున్నారు.
దీనిలో భాగంగానే తెలంగాణకు చెందిన ప్రజా గాయకుడు, తెలంగాణ యుద్ధనౌక గా పిలుచుకునే గద్దర్ అలియాస్ గుమ్మడి విఠల్ రావు తో ఇప్పటికే షర్మిల ప్రత్యేకంగా సమావేశం అయ్యారు అనే వార్తలు బయటకు వచ్చాయి.
గద్దర్ పార్టీలో చేరితే, ఆయనకు ఇచ్చే పదవులు, ప్రాధాన్యం పైన షర్మిల చర్చించినట్లు తెలుస్తోంది.
కొత్త పార్టీ ప్రకటించిన తరువాత పార్టీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు గద్దర్ చేసుకుంటున్నట్లు సమాచారం.ఇదే కాకుండా మరికొంత మంది తెలంగాణ ఉద్యమకారులు, టిఆర్ఎస్ ను తీవ్రంగా వ్యతిరేకించే కీలక నాయకులతో పాటు టిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపిలకు సమదూరం పాటిస్తూ వస్తున్న తటస్థ నాయకులు చాలామంది పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఇది ఇలా ఉంటే, గద్దర్ పార్టీలో చేరిది అదనంగా షర్మిల పార్టీకి కలగబోయే లాభం ఏంటి అనే దానిపైన ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

గతంలో మావోయిస్టు ఉద్యమాల్లో పని చేసిన గద్దర్ ఆ తర్వాత జనజీవన స్రవంతిలో కలిశారు.ఆ తర్వాత అనేక ప్రజా ఉద్యమాలలో పాల్గొన్నారు.తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించారు.
తన ఉద్యమ పాటలతో తెలంగాణ ఉద్యమానికి అప్పట్లో ఊపిరి పోశారు.అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత గద్దర్ కు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదనే చెప్పుకోవాలి.
తెలంగాణ ఏర్పడిన తర్వాత అనేక ఆందోళన కార్యక్రమాలు జరిగినా, రైతులు నిరుద్యోగులు పెద్దఎత్తున టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టినా గద్దర్ ఎక్కడా పెద్దగా స్పందించినట్లు గా కనిపించలేదు.అలాగే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ 2018లో కాంగ్రెస్ లో గద్దర్ చేరారు.
ఎన్నికల ప్రచారం చేపట్టారు.అయినా కాంగ్రెస్ పార్టీకి పెద్దగా కలిసి వచ్చింది లేదు.దీంతో గద్దర్ ప్రభావం అంతంత మాత్రమే అనే విషయం అందరికీ అర్థమైంది.అప్పటి నుంచి సైలెంట్ గానే ఉంటున్నారు.
ఇప్పుడు షర్మిల పార్టీలో చేరి కీలకంగా వ్యవహరించాలని చూస్తున్న గద్దర్ షర్మిల పార్టీలో చేరడం వల్ల ఆ పార్టీకి అదనంగా కలిగే ప్రయోజనం ఏంటి అనే అభిప్రాయాలు ఇప్పుడు షర్మిల సన్నిహితుల మధ్య వ్యక్తమవుతోందట.