ఫుల్ స్వింగ్ లో 'గాడ్ ఫాదర్' మ్యూజిక్ సెషన్ స్టార్ట్!

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సినిమాల్లో గాడ్ ఫాదర్ సినిమా ఒకటి.ఈ సినిమా తమిళ్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతుంది.

మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమాకు ఇది రీమేక్ గా తెరకెక్కుతుంది.ఇక ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసుకుని ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది.

ఇక ఇటీవలే ఊటీ లో సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది.ఈ విషయాన్ని ఈ సినిమా నిర్మాణ సంస్థ అయినా సూపర్ గుడ్ ఫిలిమ్స్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

ఈ సినిమాను సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఎన్వీ ప్రసాద్, ఆర్ బి చౌదరి తో కలిసి రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

ఇక తాజాగా ఈ సినిమా గురించిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి థమన్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.ఈ సినిమా మ్యూజిక్ సెషన్ స్టార్ట్ చేసాడని థమన్ తెలిపాడు.

తాజాగా డైరెక్టర్ మోహన్ రాజా, డీఓపీ నీరవ్ షా తో కలిసి ఈ సినిమా గురించి చర్చించినట్టు తెలుస్తుంది.

ఆ తర్వాత వీరితో కలిసి దిగిన ఫోటోను నెట్టింట పోస్ట్ చేసాడు.గాడ్ ఫాదర్ మ్యూజిక్ సెషన్ ఫుల్ స్వింగ్ లో ఉందంటూ థమన్ తన పోస్ట్ ద్వారా తెలిపారు.ఇక చిరంజీవి ఈ సినిమా కంటే ముందు ఆచార్య సినిమాలో నటించాడు.

ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా సిద్ద అనే పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నాడు.ఈ సినిమాలో చిరంజీవి కి జోడీగా కాజల్ అగర్వాల్, చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు.

ఎన్టీఆర్ ప్రశాంత్ మూవీకి ఆ టైటిల్ ను ఫిక్స్ చేయడం కష్టమే.. ఆ కష్టాన్ని అధిగమిస్తారా?
ఎన్టీఆర్ ఫ్యాన్ చేసిన పని తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.. తారక్ ను చూడాలని 300 కిలోమీటర్లు నడిచాడా?

ఇక ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.దేంతో పాటు చిరంజీవి భోళా శంకర్ సినిమా కూడా ప్రకటించాడు.గాడ్ ఫాదర్ పూర్తి అవ్వగానే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు