టైమ్స్ స్క్వేర్ , నయాగారా ఫాల్స్ వరకు .. ఐకానిక్ ప్లేస్‌ల నుంచి మోడీకి ఇండో - అమెరికన్ల సందేశాలు

వచ్చే వారం ప్రధాని నరేంద్ర మోడీ( PM Narendra Modi ) అమెరికా పర్యటనకు వెళ్తున్న సంగతి తెలిసిందే.

ఆయన రాకకోసం అగ్రరాజ్యంలో స్థిరపడిన ప్రవాస భారతీయులు, అమెరికన్లు( Indian-American Community ) వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

అధ్యక్షుడు జో బైడెన్, ఫస్ట్ లేడి జిల్ బైడెన్ ఆహ్వానం మేరకు అమెరికాకు చేరుకోనున్న మోడీకి ఘన స్వాగతం పలికేందుకు ఇండో అమెరికన్లు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ , నయాగరా జలపాతం, ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ నుంచి హావాయి వరకు వున్న ఐకానిక్ ప్రదేశాల్లో స్వాగత సందేశాలను పంపుతున్నారు.

జూన్ 20న న్యూయార్క్ చేరుకుని 21న ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు నాయకత్వం వహించనున్నారు ప్రధాని మోడీ.ఈ సందర్భాన్ని పురస్కరించుకుని డయాస్పోరా సభ్యులు, యువ విద్యార్ధులు సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.

న్యూయార్క్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా( Consulate General Of India ) సిబ్బంది .డయాస్పోరా సభ్యులు అమెరికాలోని ఐకానిక్ లాండ్‌మార్క్‌ల నుంచి పంపుతున్న వీడియోలను ట్వీట్ చేస్తున్నారు.అమెరికా చట్టసభ సభ్యులు, నాయకులు, గవర్నర్లు భారత ప్రధానికి తమ స్వాగత సందేశాలను పంపుతున్నారు.

Advertisement

ఈ ఐకానిక్ ప్లేసుల్లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ , నయాగరా ఫాల్స్, న్యూజెర్సీలోని ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీ, న్యూయార్క్‌లోని కొలంబియా బిజినెస్ స్కూల్, ఒహియోలోని నేషనల్ మ్యూజియం ఆఫ్ ది యూఎస్ ఎయిర్ ఫోర్స్, న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్, బ్రూక్లిన్ బ్రిడ్జ్ అండ్ ది ఎడ్జ్, డేటన్, ఒహియోలోని రైట్ బ్రదర్స్ మ్యూజియం, ఫిలడెల్ఫియాలోని లిబర్టీ బెల్, న్యూ ఇంగ్లాండ్, హవాయిలలోని చారిత్రక ప్రదేశాలు వున్నాయి.

కాగా.మోడీ ఎయిర్ ఇండియా వన్ న్యూయార్క్‌లో ల్యాండైన వెంటనే భారతీయ అమెరికన్ల బృందం ఆండ్రూస్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌కు వెళ్లాలని ప్లాన్ చేస్తోంది.మరో 600 మంది కమ్యూనిటీ సభ్యులు వాషింగ్టన్‌లోని వైట్‌కి సమీపంలోని విల్లార్డ్ ఇంటర్‌ కాంటినెంటల్ (మోడీ బస చేయనున్న హోటల్) ఎదురుగా వున్న ఫ్రీడమ్ ప్లాజా వద్దకు వెళ్లాలని భావిస్తున్నారు.

అక్కడ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, పశ్చిమం నుంచి తూర్పు వరకు భారతదేశానికి చెందిన కళలు, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు.ఇక యూఎస్ కాంగ్రెస్ ఉభయ సభలను ఉద్దేశించి మోడీ రెండవసారి ప్రసంగించనున్నారు.

తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత ప్రధానిగా ఆయన చరిత్ర సృష్టించనున్నారు.యూఎస్ కాంగ్రెస్‌లో ప్రసంగించాల్సిందిగా అమెరికా చట్టసభ సభ్యులు మోడీకి ఆహ్వానం పంపిన సంగతి తెలిసిందే.

కమల్ హాసన్ భారతీయుడు 3 తో మరోసారి నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడా..?
అందంగా పుట్టడమే ఈ మోడల్ తప్పయింది.. ఫ్రెండ్స్ ఏం చేశారో తెలిస్తే..

అలాగే వాషింగ్టన్‌లోని జాన్ ఎఫ్ కెన్నడీ సెంటర్‌లో అమెరికాకు చెందిన అగ్రశ్రేణి కంపెనీల ఛైర్మన్ , సీఈవోలను ఉద్దేశించి కూడా మోడీ ప్రసంగిస్తారు.అదే రోజు సాయంత్రం వాషింగ్టన్ డీసీలోని రోనాల్డ్ రీగన్ సెంటర్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని మాట్లాడతారు.

Advertisement

తాజా వార్తలు