అలాంటి వారికి రిలయన్స్ బంకుల్లో ఇంధనం ఫ్రీ..!

కరోనా సెకండ్ వేవ్ తీవ్రత వల్ల రోజు రోజుకి కేసులు.మృతుల సంఖ్య పెరుగుతుంది.

అయితే లాక్ డౌన్ వల్ల కేసుల సంఖ్య కొద్దిగా తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తుంది.అయితే ఇలాంటి టైం లో కొన్ని కంపెనీలు తమ ఉదారత చాటుకుంటున్నాయి.

కోవిడ్ మహమ్మారితో పోరాడుతున్న వారికి తమ వంతు సాయంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇంధనం ఫ్రీగా ఇవ్వాలని నిర్ణయించింది.కోవిడ్ సహాయక చర్యల్లో పాల్గొంటున్న అత్యవసర వాహనాలు అంబులెన్స్ లకు రిలయన్స్ బంకుల్లో ఉచిత ఇంధనాన్ని అందించనున్నట్టు తెలిపారుయ్.

తెలుగు రెండు రాష్ట్రాలకు సంబందించిన అంబులెన్స్ లకు రిలయన్స్ పెట్రోల్ బంకుల్లో ఇంధనం ఫ్రీగా పోయించుకోవచ్చని చెబుతున్నారు.అయితే సబంధిత అధికారుల నుండి పర్మిషన్ లెటర్ ఉన్న వాహనాలకే ఇది వర్తిస్తుందని చెబుతున్నారు.

Advertisement

కోవిడ్ సహాయక చర్యల్లో పాల్గొంటున్న వాహనాలకు రోజుకి గరిష్ఠంగా గా 50 లీటర్ల ఇంధనం ఫ్రీగా అందిస్తుంది రిలయన్స్ ఇండస్ట్రీస్.జూన్ 30 వరకు ఇది అందుబాటులో ఉంటుందని తెలిపారు.

అయితే సంబంధిత పత్రాలు ఉన్న వారికే రిలయన్స్ బంకుల్లో ఫ్రీ పెట్రోల్, డీజిల్ దొరుకుతుంది.ముఖ్యంగా అంబులన్స్ లకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నట్టు తెలుస్తుంది.

అంతేకాదు రెండు రాష్ట్రాలకు 80 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ ను అందించినట్టు రిలయన్స్ ఇండాస్ట్రీస్ తెలిపింది.రిలయన్స్ ఇండస్ట్రీస్ చేస్తున్న ఈ పనికి నెటిజెన్లు మెచ్చుకుంటున్నారు.

విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ...క్లారిటీ ఇచ్చిన టీమ్!

Advertisement

తాజా వార్తలు