OTS పై తీవ్ర విమర్శలు చేసిన టిడిపి మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు

రాష్ట్రంలో తుగ్లక్ ముఖ్యమంత్రి పరిపాలనలో ఉదయం లేస్తే ఏ దోపిడీ జరుగుతుందో ఎవరికీ అర్ధంకావట్లేదు.

ఎప్పుడో ఎన్ టి రామారావు గారు టైములో 39 సం.

ల క్రితం నుంచి పేదవాళ్ళకి ఇల్లులు ఇచ్చుకుంటూ వస్తున్నాము.రామారావు గారే కాదు.

అప్పటి నుండి పనిచేసిన ముఖ్యమంత్రులు అందరు కూడా ఇల్లులు ఇచ్చారు.ఇప్పుడు ఆ ఇల్లులు అన్నిటికి కూడా OTS పేరుతో రిజిస్ట్రేషన్ నిర్ణయం మూర్ఖత్వం.

ఆ ఇల్లులకు ఇంటి పన్ను , కరెంటు బిల్లు కడుతున్నారు.MRO రిజిస్టేషన్ చేస్తే ఆ రిజిస్టేషన్ ఎలా వర్తిస్తుంది.

Advertisement

సబ్ రిజిస్టేషన్ ఆఫీసులో కదా రిజిస్టేషన్ చెయ్యాలి.మున్సిపాలిటీలో అయితే 15 వేల రూపాయిలు, పంచాయితీలో అయితే 10వేల రూపాయిలు , కార్పొరేషన్ లో అయితే 20 వేల రూపాయిలు కట్టమన్నారు.

OTS నిర్ణయాన్ని ప్రజలందరు వ్యతిరేకిస్తున్నారు.విశాఖపట్నం జిల్లాలో మొత్తం లబ్దిదారులు 1 లక్షా 23వేల 8 వందల 75 మంది ఉంటే అందులో కేవలం 15 వేల మందే కట్టారు.

మిగతావాళ్ళు కట్టలేమని ధైర్యంగా చెప్పుతున్నారు.ప్రజల వ్యతిరేకంతో ఈ OTS వసూలు కార్యక్రమాన్ని డ్వాక్రా గ్రూపు మహిళకు అప్పగించారు.

కట్టకపోతే మీ డ్వాక్రా గ్రూపుల్లో మీరు దాచుకున్న డబ్బుని తీసుకోవడాని ప్రయత్నం చేస్తున్నారు.డ్వాక్రా గ్రూపులలో ఉన్న డబ్బులను RP ల ద్వారా, గ్రామాల్లో అయితే CAల ద్వారా లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

కాబట్టి దయచేసి మీరు ఎవరూ ఈ OTS కట్టకండి.మీకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది.

Advertisement

ఈ దోపిడిని అరికట్టడం కోసం పార్టీలకు అతీతంగా నాయకులందరూ ప్రజలకు అవగాహన కల్పించాలి.

తాజా వార్తలు