వర్షం ధాటికి కూలిన ఇండ్లను పరిశీలించిన మాజీ ఎంపీటీసీ.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని 14వ వార్డులో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు దెబ్బతిన్న ఇండ్లను స్థానిక మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ క్షేత్ర స్థాయిలో పరిశీలించి నష్టపరిహారం అందించాలని మండల తహశీల్దార్ బి.

రామచంద్రం ను ఒగ్గు బాలరాజు యాదవ్ కోరారు.

ఇల్లు లేక నిరశ్రయుడిగా మారిన బక్కి ఎల్లయ్య ఇంటిని పరిశీలించి ఇతడి కుటుంబంలో ఐదుగురు సభ్యులు ఉన్నారని వీరి పరిస్థితి దయనీయంగా ఉందనీ జిల్లా కలెక్టర్ తో పోన్ లో మాట్లాడగా తన కార్యాలయం కు తీసుకురావాలని మాజీ ఎంపీటీసీ నీ ఆదేశించారు.అదే విధంగా బక్కి రామయ్య ఇల్లు కూలిపోగా అట్టి ఇల్లును పరిశీలించి అట్టి ఇంటిలో ఉంటున్న వారిని తన అత్త గారు అయిన మస్కూరి రాజవ్వ ఇంటికి తరలించారు.

అదే విధంగా రేకుల షెడ్డులో ఉంటున్న జల్లి రాజవ్వ ఇంటిని పరిశీలించి వారికి తగు సూచనలు చేయడం జరిగింది.సనుగుల లక్ష్మి ఇల్లు పూర్తిగా నేలమట్టం కాగ క్షేత్ర స్థాయిలో పరిశీలించి తక్షణ సహాయం అందించాలని మండల తహశీల్దార్ బి.రామచంద్రం ను కోరగా వెంటనే స్పందించి వారానికి సరిపడు నిత్యావసర వస్తువులు అందించారు.మాజీ ఎంపీటీసీ వెంట బాయికాడి రాజయ్య, కొత్తపల్లి తిరుపతి, అంతేర్పుల కనకరాజు,జల్లి అశోక్, బక్కి నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.

కెనడాలో భారతీయుడిని గెంటేసిన ఇంటి ఓనర్ .. ఒంటిపై చొక్కా లేకుండా రోడ్డుపైకి
Advertisement

Latest Rajanna Sircilla News