మాజీ మంత్రి మోత్కుప‌ల్లికి తీవ్ర అస్వ‌స్థ‌త‌

యాదాద్రి భువనగిరి జిల్లా: ఆలేరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి,కాంగ్రెస్ నాయ‌కుడు మోత్కుప‌ల్లి న‌ర్సింహులు శనివారం ఉదయం తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు.

మాదిగలకు కాంగ్రెస్ పార్టీలో అన్యాయం చేశారంటూ శుక్రవారం హైదారాబాద్ లోని తన నివాసంలో ఒక దీక్ష చేసిన విషయం తెలిసిందే.

దీక్షతో ఆయన బీపీ,షుగర్ లెవల్స్ ప‌డిపోయాయి.దీనితో కుటుంబ స‌భ్యులు మోత్కుపల్లిని బేగంపేట‌లోని వెల్‌ నెస్ హాస్పిట‌ల్‌లో చేర్పించారు.

ఆసుపత్రి వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.ఆయ‌న ఆరోగ్యంపై కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

Advertisement

Latest Yadadri Bhuvanagiri News