ఇప్పుడు మరో మాజీ మంత్రి వంతు ? అరెస్టు కు సర్వం సిద్ధం అయ్యిందా ?

తెలుగుదేశం పార్టీకి ఈ రోజు, రేపట్లో మరో ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తుంది.

గత టీడీపీ ప్రభుత్వం లో నెలకొన్న అవినీతి అక్రమాలపై సమగ్రంగా విచారణ చేపడుతున్న ఏపీ ప్రభుత్వం, ఒక్కో టీడీపీ కీలక నేతలు జైలుకు పంపించే ఏర్పాట్లు చేస్తోంది.

ఈఎస్ఐ కుంభకోణంలో ఇప్పటికే మాజీ మంత్రి అచ్చెన్న నాయుడు అరెస్ట్ కాగా, అనంతపురం జిల్లా కీలక నాయకుడు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా వాహనాల అక్రమ అమ్మకాల వ్యవహారంలో జైలుపాలయ్యారు.ఇప్పటికీ వారికి బెయిల్ లభించడంతో రిమాండ్ లో వున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అప్రమత్తమై పార్టీ శ్రేణులు ఎక్కడా అదుపుతప్పి ప్రవర్తించ వద్దని, ప్రభుత్వం ఏ ఒక్కరిని వదిలిపెట్టేలా కనిపించడం లేదని, జాగ్రత్తగా ఉండాలంటూ అనేక సూచనలు చేసింది.అయినా ఇవేమి పట్టించుకోకుండా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు వ్యవహరించి మరో వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.

ఒక మహిళ ప్రభుత్వ ఉద్యోగిని ఉద్దేశించి అనుచితంగా ఆయన వ్యాఖ్యలు చేసినట్లుగా సాక్ష్యాధారాలతో సహా దొరకడంతో ఆయనపై పోలీసు కేసు నమోదయ్యింది.ఇప్పటికే మత్తు డాక్టర్ సుధాకర్ వ్యవహారంలోనూ అయ్యన్నపాత్రుడు పాత్ర ఉందని వైసీపీ అనేక విమర్శలు చేసింది.

Advertisement

ఇవి ఇలా కొనసాగుతుండగా, ఇప్పుడు మహిళా అధికారిని దూషించడంతో ఆయనపై నిర్భయ, లాక్ డౌన్ ఉల్లంఘన కేసు నమోదు చేశారు.మున్సిపల్ కౌన్సిల్ హాల్ ఆధునీకరణ పనులు జరుగుతుండడంతో అయ్యన్నపాత్రుడు తాత లత్సా పాత్రుడు ఫోటోని అధికారులు హాలు నుంచి వేరే గదిలోకి మార్చారు.

అయితే తన తాత ఫోటోను మార్చడానికి కుదరదని, మళ్లీ ఎక్కడి నుంచి తీశారో అక్కడే ఉంచాలంటూ అయ్యన్నపాత్రుడు ఈ నెల 15వ తేదీన మున్సిపల్ కార్యాలయం వద్ద పార్టీ కార్యకర్తలతో ఆందోళనకు దిగారు.మున్సిపల్ హాల్ కు రంగులు వేస్తున్నామని, మరో నెల రోజుల్లో చిత్రపటాన్ని యథా స్థానంలో ఉంచుతాము అంటూ వివరణ ఇచ్చినా అయ్యన్నపాత్రుడు వెళ్లకపోగా, కమిషనర్ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు.

స్థానిక ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ కు ఆమె తొత్తు గా మారారంటూ విమర్శించారు.పోలీసులు, పెద్ద సమక్షంలో ఇచ్చిన మాట ప్రకారం ఫోటోను నెల రోజుల్లో యథా స్థానంలో పెట్టకపోతే కమిషనర్ బట్టలు ఊడదీసే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.

కమిషనర్ ఆడ ఆఫీసర్ అయిపోయింది, అదే మగవాళ్ళైతే వేరే విధంగా ట్రీట్మెంట్ ఉండేది అంటూ ఆయన బెదిరించినట్లు గా కమిషనర్ తోట కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిర్భయ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

అలాగే లాక్ డౌన్ సమయంలో నిబంధనలు పాటించకుండా, గుంపులుగా జనాలను పోగు చేశారని ఆయనపై మరో కేసు నమోదైన సంగతి తెలిసిందే.ఇప్పుడు ఈ వ్యవహారంలో ఆయనను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.ఈరోజు రాజ్యసభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ రోజు కానీ, రేపు కాని అయ్యానను అరెస్టు చేయాలని చూస్తున్నారట.

Advertisement

టిడిపి కీలక నాయకుడిగా ఉన్న అయ్యన్న ను అరెస్టు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు సిద్ధంగా ఉండాలంటూ ఇప్పటికే పార్టీ శ్రేణులకు టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చినట్లు సమాచారం.అలాగే ఈఎస్ఐ కుంభకోణంలో మరో మాజీ మంత్రి పేరు కూడా ఎక్కువగా వినిపిస్తుండటంతో, ఆయనను కూడా అతి త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

తాజా వార్తలు