చీరెలు, చొక్కాల మధ్య వాటిని పెట్టి అక్రమంగా తరలించేస్తున్నారు..!

ఈ మధ్య కాలంలో బంగారం, విదేశీ కరెన్సీ, విలువైన వస్తువులను అక్రమంగా తరలించే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

చెన్నై, హైదరాబాద్ విమానశ్రయాల్లో అధికారుల తనిఖీల్లో అక్రమార్కులు విలువైన వస్తువులను తరలిస్తూ పట్టుబడుతున్నారు.

కొన్నిసార్లు అక్రమార్కులు వస్తువులను, కరెన్సీను తరలిస్తున్న తీరు చూసి ఆశ్చర్యపోవడం అధికారుల వంతవుతోంది.తాజాగా చెన్నైలో కస్టమ్స్ అధికారులు కోటీ 36 లక్షల విలువైన విదేశీ, దేశీయ కరెన్సీని పట్టుకున్నారు.

కస్టమ్స్ అధికారులకు కొందరు ఉదయం పార్శిళ్ల ద్వారా నగదును అక్రమంగా తరలిస్తున్నట్టు సమాచారం అందింది.చెన్నై నుంచి సింగపూర్ కు వెళుతున్న పార్సిళ్లను పరిశీలించగా అక్రమంగా తరలిస్తున్న పార్శిళ్ల గుట్టు రట్టైంది.

చీరలు, చొక్కాల మధ్య కరెన్సీ ఉండటంతో అవాక్కవ్వడం అధికారుల వంతయింది.ఒక పార్శిల్ లో 50 వేల డాలర్లు, మరో పార్శిల్ లో 4,000 పౌండ్లు, ఇంకొక పార్శిల్ లో 30 లక్షల విలువ చేసే భారత్ కరెన్సీని అధికారులు గుర్తించారు.

Advertisement

కస్టమ్స్ కమిషనర్ రాజన్ చౌదరి తమకు సమచారం అందడంతో తనిఖీ చేపట్టగా కోటీ 36 లక్షల విలువ చేసే నగదును పట్టుకున్నామని తెలిపారు.పార్శిళ్లలో ఉండే ఫ్రమ్ అడ్రస్ ఆధారంగా విచారణ జరుపుతున్నామని తెలిపారు.

త్వరలో ఈ కరెన్సీకి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు.మరోవైపు శంషాబాద్ ఎయిర్ పోర్టులో సైతం అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న అక్రమార్కులు తరచూ పట్టుబడుతూ ఉండటం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు