పిల్లల్లో రోగనిరోధకశక్తిని పెంచే ఆహారం ఇది

పిల్లలు ఉన్నచోట ఉండటం కష్టం.మట్టి, ధూళిలో ఆడేస్తారు.

ఆరోగ్య జాగ్రత్తలు వాళ్ళకి అసలు తెలీవు.

దీంతో రకరకాల ఇంఫెక్షన్లు వారిపై దాడి చేయొచ్చు.

ఆ దాడిపై ఎదురుదాడి చేయాలంటే వారికి రోగనిరోధకశక్తి అవసరం.పిల్లల్లో రోగనిరోధకశక్తి చిన్నప్పటి నుంచే పెంచాలంటే ఈ ఆహారం ఇవ్వండి.

* కూరగాయల్లో కెరీటనాయిడ్స్ తో పాటు యాంటి ఆక్సిడెంట్స్ ఉంటాయి.ఇవి ఇమ్యునిటిని పెంచుతాయి.

Advertisement

కూరగాయల భోజనం చిన్నప్పుడే అలవాటు చేయండి.* పెరుగు కూడా రోగనిరోధకశక్తిని పెంచుతుంది.

ఎందుకంటే దీనిలో ప్రొబయోటిక్స్ ఉంటాయి.పెరుగు చల్లగా, రుచిగా ఉంటుంది కాబట్టి, పిల్లలు కాదనకుండా తింటారు.

* ఫైబర్ మరియు ఫెటోకెమికల్స్ వంటి పోషకాలు రోగనిరోధకశక్తికి మంచివి.ఇవి కాలిఫ్లవర్ లో బాగా లభిస్తాయి.

పిల్లల డైట్ లో దీన్ని చేర్చండి.* బీన్స్, కాయధాన్యలు రెగ్యులర్ గా ఇస్తే, బిడ్డ ఎంత ఆరోగ్యంగా ఉంటాడో మీరే చూస్తారు.

ఇరాన్ అధ్యక్షుడి మృతి కారణంగా.. రేపు సంతాపదినం ప్రకటించిన భారత్ ప్రభుత్వం..!!
రామ్ చరణ్ ఆ విషయం లో ఎందుకు సైలెంట్ గా ఉంటున్నాడు..?

* రోజూ ఉడకబెట్టిన గుడ్డు తినపించడం ద్వారా కూడా పిల్లల ఇమ్యునిటి సిస్టమ్ ని బలంగా తయారుచేయవచ్చు.దీంట్లో ప్రొటీన్స్ ఉండటం అదనపు లాభం.

Advertisement

* వైట్ బ్లడ్ సెల్స్ ని పెంచడానుకి వెల్లులి మంచి మార్గం.ఇది రోగనిరోధకశక్తిని బాగా పెంచుతుంది.

* బెర్ర్రి ఫలాలు ఏవైనా సరే, పిల్లల ఇమ్యినిటి సిస్టమ్ కి మంచివే.* వాల్ నట్స్ కూడా రోగనిరోధకశక్తిను బాగా పెంచేస్తాయి.

ఎందుకంటే వీటిలో ఒమేగా త్రి ఫ్యాటి ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.

తాజా వార్తలు