ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల కిడ్నీల పనితీరు మెరుగుపడుతుందా...

మన ఆరోగ్యంలో ముఖ్యపాత్ర పోషించే కిడ్నీలను ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఈ మధ్యకాలంలో జీవన విధానంలో మార్పులు కారణాల వల్ల కిడ్నీల పనితీరు మందగిస్తూ ఉంది.

కిడ్నీలు బీపీని, ఎర్ర రక్తకణాల తయారీని నియంత్రించే హార్మోన్లను ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి.అంతే కాకుండా మధుమేహం, అధిక రక్తపోటు, మందుల వాడకం వంటి పలు కారణాలతో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో లక్షలాది మంది ప్రజల కిడ్నీలు దెబ్బతింటున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇంకా చెప్పాలంటే సరైన ఆహారం, జీవనశైలి మార్పులతో కిడ్నీలను కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.రోజు సరిపడా నీరు త్రాగడం, వ్యాయామం చేయడం ద్వారా కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.కిడ్నీ వ్యాధులను లక్షణాల ద్వారా పసిగట్టవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

విపరీతమైన అలసట, ఏకాగ్రత లోపించడం, నిద్రలేమి, ఆకలి మందగించడం, కండరా నొప్పులు, కళ్ళలో వాపు, కంటి చుట్టూ నల్లటి వలయాలు, వికారం, పొటాషియం లెవెల్స్ పెరగడం, రక్తహీనత వంటివి కిడ్నీ వ్యాధుల లక్షణాలు అని వైద్యులు చెబుతున్నారు.ఈ లక్షణాలు కనుక కనిపిస్తే ఎంతో జాగ్రత్తగా కిడ్నీలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

Advertisement

అంతేకాకుండా కిడ్నీలో పనితీరు మెరుగుపడాలంటే మధుమేహం, అధిక రక్తపోటును అదుపు చేసుకోవాలని చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే అధిక బరువును అదుపులో ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.ఈ లక్షణాలు ఉన్న వారిలో మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అంతే కాకుండా ఇలాంటి లక్షణాలు ఉన్నవారు వైద్యుల సలహా లేకుండా ఎటువంటి ఇంగ్లీష్ మందుల వాడకం చేయకూడదని హెచ్చరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు