Hairfall : జుట్టు విపరీతంగా రాలిపోతుందా.. షాంపూ చేసేటప్పుడు ఇలా చేశారంటే మీ సమస్యకు పరిష్కారం దొరికినట్లే!

జుట్టు( Hair ) విపరీతంగా రాలిపోతుందా.? హెయిర్ ఫాల్ వల్ల రోజు రోజుకు కురులు పల్చగా మారుతున్నాయా.

? జుట్టు రాలడాన్ని ఎలా అడ్డుకోవాలో అర్థం కావడం లేదా.? అయితే అస్స‌లు వర్రీ అవ్వకండి.నిజానికి కొన్ని కొన్ని ఇంటి చిట్కాలతో చాలా సులభంగా హెయిర్ ఫాల్ సమస్య( Hairfall Problem )ను కంట్రోల్ చేసుకోవచ్చు.

ముఖ్యంగా షాంపూ చేసేటప్పుడు ఇప్పుడు చెప్పబోయే చిన్న చిట్కాను పాటించారంటే మీ సమస్యకు పరిష్కారం దొరికినట్టే.అందుకోసం ఒక చిన్న కలబంద ఆకు( Aloevera )ని తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న కలబంద ముక్కలు వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు బియ్యం మరియు రెండు టేబుల్ స్పూన్లు కలోంజి సీడ్స్( Kalonji Seeds ) వేసి రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి.

ఆపై గరిటెతో అన్నిటిని కలిపి మూత పెట్టి నైట్ అంతా నానబెట్టుకోవాలి.

Advertisement

మరుసటి రోజు ఉదయాన్నే నానబెట్టుకున్న పదార్థాలను చేతితో బాగా స్మాష్ చేసుకుంటూ కలపాలి.ఆపై వాటర్ ను మాత్రం సపరేట్ చేసుకుని పెట్టుకోవాలి.ఇప్పుడు ఈ వాటర్ లో మీ రెగ్యులర్ షాంపును మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు వేసి మిక్స్ చేయండి.

ఆపై ఈ వాటర్ ను ఉపయోగించి హెయిర్ వాష్( Hairwash ) చేసుకోవాలి.ఈ విధంగా వారానికి రెండు సార్లు కనుక తలస్నానం చేస్తే హెయిర్ ఫాల్ సమస్య క్రమంగా కంట్రోల్ అవుతుంది.

బియ్యం, కలోంజి సీడ్స్‌ మరియు కలబంద జుట్టుకు చ‌క్క‌ని పోషణ అందిస్తాయి.కుదుళ్లను బలోపేతం చేసి జుట్టు రాలడాన్ని అరికడతాయి.అలాగే ఇప్పుడు చెప్పిన విధంగా హెయిర్ వాష్ చేసుకోవడం వల్ల కురులు సూపర్ సిల్కీగా, షైనీ( Silky Hair ) గా మారతాయి.

జుట్టు చిట్లడం, విరగడం వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి.అదే సమయంలో హెయిర్ గ్రోత్ సైతం ఇంప్రూవ్ అవుతుంది.కాబట్టి జుట్టు అధికంగా ఊడిపోతుందని బాధపడుతున్న వారు తప్పకుండా షాంపూ చేసేటప్పుడు ఇప్పుడు చెప్పుకున్న సింపుల్ చిట్కాను పాటించండి.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చరిత్ర సృష్టించారు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన పరుచూరి!

జుట్టు రాలడాన్ని అరికట్టండి.

Advertisement

తాజా వార్తలు