Glowing Skin : మేకప్ లేకపోయినా వైట్ గా బ్రైట్ గా మెరిసిపోవాల‌ని భావిస్తున్నారా..అయితే ఈ రెమెడీ మీకోస‌మే!

అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.ఈ క్రమంలోనే చాలా మంది అందాన్ని పెంచుకోవడం కోసం మేకప్ తో( Makeup ) మెరుగులు దిద్దుతున్నారు.

అయితే మేకప్ లేకపోయినా కూడా ముఖాన్ని వైట్ గా, బ్రైట్ గా మెరిపించుకోవచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ చాలా అంటే చాలా ఉత్త‌మంగా సహాయపడుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టమాటో స్లైసెస్( Tomato Slices ) వేసుకోవాలి.

అలాగే రెండు లెమన్ స్లైసెస్,( Lemon Slices ) రెండు క్యారెట్ స్లైసెస్ మరియు మూడు స్పూన్లు రోజ్‌ వాటర్( Rose Water ) వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

Advertisement

ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి మరియు హాఫ్ టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని కేవలం 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై చర్మాన్ని ( Skin ) వాటర్ తో శుభ్రంగా కడిగి క్లీన్ చేసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి ఈ రెమెడీని పాటించడం వల్ల ఎన్నో స్కిన్ కేర్ బెనిఫిట్స్ పొందుతారు.

ఈ సింపుల్ అండ్ వండర్ ఫుల్ హోమ్ రెమెడీ మీ చర్మానికి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది.

ఇది చర్మం పై పేరుకుపోయిన డస్ట్ మరియు డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది.చర్మాన్ని వైట్ గా బ్రైట్ గా మారుస్తుంది.మొండి మచ్చలు ఏమైనా ఉంటే వాటిని తొలగిస్తుంది.

నిర్మాతల కోసం పెద్ద మనసు చాటుకున్న చిరంజీవి.. ఇంద్ర రీరిలీజ్ వెనుక ఇంత జరిగిందా?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 20 శుక్రవారం, 2020

వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ను కూడా రిమూవ్ చేస్తుంది.అంతేకాదు ఈ రెమెడీని పాటించడం వల్ల మేకప్ లేకపోయినా సరే మీరు అందంగా కాంతివంతంగా మెరిసిపోతారు.

Advertisement

న్యాచురల్ గ్లో మీ సొంతమవుతుంది.

తాజా వార్తలు