మగువల్లో చాలా మంది పొడవాటి ఒత్తైన కురులను కోరుకుంటారు.
అటువంటి జుట్టును పొందడం కోసం ఖరీదైన షాంపూ, కండిషనర్, ఆయిల్ తో పాటు సీరం వంటి ఉత్పత్తులను కూడా వాడుతుంటారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ మీకు చాలా అంటే చాలా అద్భుతంగా సహాయపడుతుంది.ఈ రెమెడీని కనుక పాటిస్తే సూపర్ లాంగ్ అండ్ థిక్ హెయిర్( Super long and thick hair ) మీ సొంతం అవుతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం,( Rice ) వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజలు వేసి పది నిమిషాల పాటు ఉడికించాలి.వాటర్ జెల్లీగా మారుతుంది.
అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆ జెల్లీ వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ చల్లారే లోపు ఒక ఉల్లిపాయను తీసుకుని పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోండి.
ఆ ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ ఉల్లిపాయ జ్యూస్ ( Onion juice )ను ముందుగా తయారు చేసిన వాటర్ లో వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆముదం, నాలుగు చుక్కలు విటమిన్ ఈ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి .గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.
జుట్టు కుదుళ్లు బలోపేతం అవుతాయి.జుట్టు రాలడం తగ్గుతుంది.
ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది.కాబట్టి లాంగ్ అండ్ థిక్ హెయిర్ ను కోరుకునే వారు తప్పకుండా ఈ హోమ్ రెమెడీని ట్రై చేయండి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy