మీ పాన్ కార్డ్ లో ఫోటో మార్చాలంటే ఈ సింపుల్ టిప్స్ పాటించండి..!

ఈ కాలంలో ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డుతో పాటు పాన్ కార్డు కూడా ముఖ్యమైన డాక్యూమెంట్స్ లిస్ట్ లో చేరిపోయింది.

ఆధార్ కార్డుకు గాని బ్యాంకు పాస్ బుక్ కు గాని పాన్ కార్డు అనుసంధానం అనేది చాలా ముఖ్యం.

అయితే మనం పాన్ కార్డుకు అప్లై చేసేటప్పుడు తప్పనిసరిగా మన ఫోటో ఒకటి ఇవ్వాలి.ఏదో కంగారులో మన దగ్గర ఉన్న ఎప్పటి ఫోటోనో ఇచ్చి అప్లై చేసేస్తాం.

తీరా పాన్ కార్డు వచ్చాక ఆ కార్డు మీద ఉన్న మన ఫోటో చూసుకుని అయ్యో అప్పుడే మంచి ఫొటో ఇచ్చి ఉంటే బాగుండేది అని అనుకుంటాం కదా.ఫోటో మంచిగా వచ్చినవాళ్ల సంగతి పర్వాలేదు కానీ ఆ ఫోటో సరిగ్గా రాని వారు మేము చెప్పే ఈ ప్రోసెస్ ఫాలో అయితే చాలు ఎంచక్కా మీకు నచ్చిన ఫోటోను మీ పాన్ కార్డులో పెట్టుకోవచ్చు.పాన్ కార్డు అనేది ఇది ఒక వ్యక్తి ఆర్థిక చరిత్రను రికార్డు చేస్తుంది.

అందుకనే పాన్ కార్డు కోసం ఇచ్చే సమాచారం అంతా కరెక్ట్ గా ఉండాలి.ఒకవేళ మీ సంతకం, ఫొటో పాన్ కార్డులో ఉన్నట్టుగా లేకపోతే వాటిని మార్చుకోవాలని ఇలా చేయండి.

Advertisement

భావిస్తే ఈ ప్రాసెస్ ఫాలో అవండి.ముందుగా మీ యొక్క పాన్ కార్డు డీటెయిల్స్ ఎడిట్ చేయడానికి NSDL అనే అధికారిక వెబ్‌సైట్‌ కి వెళ్లండి.

ఆ తర్వాత అప్లికేషన్ టైప్ పై క్లిక్ చేసి పాన్ డేటా ఎడిట్ లేదా ఛేంజెస్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి.ఆ తర్వాత కేటగిరి మెనూలోకి వెళ్లి మీ పర్సనల్ ఆప్షన్ ను ఎంచుకోండి.

ఇక్కడ మీరు మార్చాలనుకున్న సమాచారాన్ని జాగ్రత్తగా మార్చి సబ్మిట్ చేయండి.మళ్ళీ ఇప్పుడు పాన్ అప్లికేషన్‌కు వెళ్లి KYCని ఎంపిక చేసుకున్నతర్వాత ఫోటో ఎడిట్, సిగ్నేచర్ ఎడిట్ ఆప్షన్ ని ఎంచుకోవాలి.

ఒకవేళ కేవలం మీ ఫోటో మాత్రమే మార్చడానికి ఫోటో ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి.అక్కడ మీ యొక్క తల్లిదండ్రుల వివరాలను పూరించిన తర్వాత దరఖాస్తుదారుడి గుర్తింపు, అడ్రస్ ప్రూఫ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు ట్యాగ్ చేయాలి.ఆ తర్వత చివరగా డిక్లరేషన్‌ ను పై క్లిక్ చేసి సబ్‌మిట్ చేయండి.అయితే మీ యొక్క ఫోటో, సంతకంలో మార్పు కోసం మీరు అప్లికేషన్ ఫీజు కింద రూ.101 చెల్లించాలి.ఒకవేళ మీకు కనుక విదేశాల్లో చిరునామా ఉంటే, ఆ చిరునామా మీద కావాలంటే మాత్రం రూ.1011 చెల్లించాలి.డబ్బులు చెల్లింపు చేసాక మీకు 15 అంకెల రశీదు వస్తుంది.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..

ఆ తరువాత అప్లికేషన్ ప్రింటవుట్‌ ను ఆదాయపు పన్ను పాన్ సర్వీస్ ఆఫీస్ లో ఇవ్వండి.అంతే మీ పాన్ కార్డు ఫొటో, సంతకం ఎడిటింగ్ అప్లికేషన్ పూర్తయినట్టే.

Advertisement

తాజా వార్తలు