క్రమం తప్పకుండా గాఢ నిద్ర కోసం.. ఈ సులువైన చిట్కాలను పాటించండి..!

ప్రస్తుత సమాజంలో ప్రజలకు ప్రశాంతమైన నిద్ర అనేది ఒక కలగా మారిపోయింది.చాలామంది రాత్రి సమయంలో విపరీతమైన అలసట కారణంగా నిద్రలేమి తో ఇబ్బంది పడుతున్నారు.

ఒక వ్యక్తి రాత్రి పూట నిద్రపోవడానికి సగటు న 10 నుంచి 20 నిమిషాల సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.కానీ ప్రపంచంలో 70 మిలియన్ల మంది ప్రజలు సరైన నిద్ర లేక ఇబ్బంది పడుతున్నారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

మనిషికి ఆరోగ్యం లేదా శరీరక శ్రేయస్సు లో సమస్య ఉంటే రాత్రి నిద్రపోవడానికి చాలా సమయం పడుతుంది.ఉదయం నిద్ర లేవడం అలవాటు లేని వారికి రాత్రి నిద్ర పట్టదు.

కొందరు ఒత్తిడి కారణంగా నిద్రలేమి( Insomnia )కి గురవుతారు.

Follow These Simple Tips For Regular Deep Sleep.. ,deep Sleep, Health , Health
Advertisement
Follow These Simple Tips For Regular Deep Sleep..! ,deep Sleep, Health , Health

మీరు పడుకున్న తర్వాత 30 నిమిషాల కంటే ఎక్కువ సమయం వరకు నిద్ర పోలేక పోతే మీ రోగనిరోధక వ్యవస్థ( Immune system ) దెబ్బతింటుంది.దీని వల్ల శరీరానికి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి.అలాకాకుండా మీరు పడుకున్న 15 నిమిషంలో నిద్రపోవడానికి ఉన్న చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మన మానసిక, శరీర శ్రేయస్సును మెరుగుపరచుకోవడానికి యోగా వ్యాయామాలు చేయాలని నిపుణులు చెబుతున్నారు.కాబట్టి మీరు వేగంగా నిద్రపోవడానికి వైద్యులు కొన్ని యోగాసనాలను సూచిస్తున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే సేతు బంధాసనం, బాలాసన, శవాసన రాత్రి పూట నిద్రను సులభంగా వచ్చేలా చేస్తాయి.

నిద్రను ప్రేరేపించడానికి మనసును ప్రశాంత పరచడం కూడా ఎంతో ముఖ్యమైన నిపుణులు చెబుతున్నారు.

Follow These Simple Tips For Regular Deep Sleep.. ,deep Sleep, Health , Health

కాబట్టి నిద్రపోవడానికి ముందు మనశ్శాంతిని కలవరపెట్టకుండా ఉండేలా చూసుకోవాలి.ఉదాహరణకు రాత్రి సమయంలో మొబైల్ ఫోన్ ను ఎక్కువగా ఉపయోగించకూడదు.కావాలంటే మంచి సంగీతాన్ని కానీ, లేదంటే ఏదైనా మీకు ఇష్టమైన పుస్తకాన్ని కానీ చదవాలి.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

దీంతో మానసిక ప్రశాంతత లభించి త్వరగా నిద్ర పడుతుంది.అలాగే నిద్రపోవడానికి సరైన సమయాన్ని ఎంచుకొని ఉండాలి.

Advertisement

ఎప్పుడూ క్రమం తప్పకుండా ఆ సమయానికి నిద్రపోతూ ఉండాలి.ఆహారాలకు మన నిద్రకు దగ్గర సంబంధాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

సాయంత్రం రాత్రి సమయంలో స్పైసీ ఫుడ్ ను అస్సలు తీసుకోకూడదు.అలాగే కాఫీ, టీ( Coffee, tea ) తాగితే నిద్ర పట్టదు.

కాబట్టి ఇలాంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

తాజా వార్తలు