వావ్, రూ.85కే గోవాకి ఫ్లైట్ టికెట్.. వైరల్ అవుతున్న పిక్!

ఈ రోజుల్లో ఫ్లైట్ టికెట్ కనీసం రూ.2000 ఖర్చు చేస్తే గానీ రావడం లేదు.

కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పోస్ట్ ప్రకారం ముంబై నుంచి గోవాకి వెళ్లే టికెట్ ధర కేవలం 85 రూపాయలే ఉంది.

అయితే ఇది ఈ కాలంనాటి ధర అనుకుంటే పొరపాటే.ఎందుకంటే ఈ టికెట్ 45 సంవత్సరాల కిందటిది.ద్రవ్యోల్బణం కారణంగా ఇప్పుడంటే అన్ని ధరలు పెరిగిపోయాయి కానీ గతంలో 100 రూపాయల లోపే అన్ని దొరికేవి.

అయితే అప్పటి రోజుల్లో ఖర్చులు ఎలా ఉండేవో ఈ జనరేషన్ వారికి ఐడియా లేదు.సోషల్ మీడియా పుణ్యమా అని అప్పటి ధరలు ఇప్పుడు వెలుగులోకి వస్తూ అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి.

వివరాల్లోకి వెళ్తే, ప్రస్తుతం ఇండియన్ ఎయిర్‌లైన్స్ సంస్థకు చెందిన 1975 నాటి టిక్కెట్టు ఫొటో ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది.ముంబై నుంచి గోవాకు కేవలం 85 రూపాయలే అని ఈ ఫొటోలో కనిపిస్తోంది.అయితే ఈ ఫోటో కింద 1974లో మంగళూరు నుంచి ముంబైకి వెళ్లే విమానానికి టికెట్ ధర కేవలం 280 రూపాయలు మాత్రమేనని మరొక నెటిజన్ వెల్లడించారు.

Advertisement

దాంతో అప్పటి రోజుల్లో విమాన టికెట్లు చాలా చౌక అని మరికొందరు పాత కాలం నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు.ఇక వైరల్ ఫొటోలో ఉన్న టిక్కెట్, బోర్డింగ్ పాస్ అరిగిపోయి ఉన్నాయి.

జర్నీ డేట్ 11/02/1975గా కనిపించింది.

ఆ ట్విట్టర్ అకౌంట్ ఈ ఫోటోలను షేర్ చేసింది.ఫ్లైట్ టికెట్ ధరతో పాటు బస్సు టికెట్ ధరను కూడా ఆ ట్విట్టర్ అకౌంట్ తెలిపింది.ఆ అకౌంట్ ట్వీట్ చేస్తూ "బాంబే టు గోవా చిత్రం 1972లో విడుదలైంది.

ఇందులో అమితాబ్ బచ్చన్, అరుణా ఇరానీ, మెహమూద్ తదితరులు నటించారు.ఈ చిత్రంలో, బస్ కండక్టర్ మెహమూద్ బొంబాయి-గోవాకు బస్సు టిక్కెట్టు కోసం అరుణా ఇరానీ నుంచి రూ.30.25 పైసలు వసూలు చేస్తాడు!" అని పేర్కొంది.అంటే ఆ కాలంలో బస్సు టికెట్ ధరలు ఎంత తక్కువగా ఉన్నాయో దీని ద్వారా అర్థం అవుతుంది.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ఛీ.. ఛీ.. ట్రక్కులో ఇరుక్కుపోయిన వ్యక్తిని కాపాడాల్సింది పోయి.. చివరకు?

ఇకపోతే స్వాతంత్రం వచ్చిన సమయంలో పాకిస్థాన్ నుంచి భారతదేశానికి తీసుకున్న రైల్వే టిక్కెట్‌ కూడా గతంలో వైరల్ అయింది.ఆ కాలంనాటి ధరలు చూసి చాలామంది అవాక్కయ్యారు.

Advertisement

తాజా వార్తలు