ఆ ఐదు వైరస్ లు చైనా సృష్టే..అమెరికా జాతీయ భద్రతాధికారి సంచలన వ్యాఖ్యలు..!!!

ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు చనిపోవడానికి కారణమైన కరోనా మహమ్మారి చైనా నుంచీ పుట్టిన విషయం విధితమే.

ఈ వైరస్ తమ దేశంలో పుట్టినా ప్రతాపం చూపింది మాత్రం మిగిలిన దేశాలపై.

ముఖ్యంగా అమెరికాపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడింది.ప్రస్తుతం అమెరికా కరోనా కోరల్లో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

అమెరికాలో పరిస్థితి ఇలాగే మరో నెలరోజులు కొనసాగితే అమెరికా అగ్ర రాజ్య హోదా హుష్ కాకి అవుతుందని నిపుణులు అంచనాలు కూడా వేస్తున్నారు.ఇదిలాఉంటే.

గడించిన 20 ఏళ్ళ కాలంలో సుమారు ఐదు రకాల వైరస్ లు చైనా నుంచీ వచ్చాయని ఈ వైరస్ లు ప్రపంచంలో అల్లకల్లోం సృష్టించాయని ప్రస్తుతం కరోనా మహమ్మారి సైతం అమెరికా నుంచీ వచ్చిందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఒబ్రయన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.నిన్నటి రోజున శ్వేత సౌధంలో మీడియా సమావేశంలో మాట్లాడిన రాబర్ట్ ఈ సంచలన విషయాలని వెల్లడించారు.

Advertisement

ప్రపంచ దేశాలు అన్నీ చైనాపై ఆరోపణలు చేస్తున్నయాని ఇవన్నీ వాస్తవాలు కాకపొతే చైనా ఎందుకు వీటిపై స్పందించడం లేదని ఆయన అన్నారు.చైనా ఈ విషయంలో ఏ మాత్రం బాధ్యత వహించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ వైరస్ లని ప్రాధమిక దశలోనే గుర్తించడం పెద్ద విషయం కాదని, ముందే గుర్తించి ఉంటే కరోనని ప్రాధమిక దశలోనే కట్టడి చేయచ్చని ఆయన అన్నారు.

చైనాకి ఈ విషయంలో సామర్ధ్యమున్నా పట్టనట్టుగా వ్యవహరించడం వలనే ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు విడిచారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు