ఈ బ్యాంకులో మీకు ఖాతా వుందా? అక్కడ మూతపడ్డ బ్యాంక్!

అవును, మీకు ఈ బ్యాంకులో ఖాతా ఉంటే బహుపరాక్.అక్కడ ఆ బ్యాంకు మూతపడింది.

అయితే ఇది మనదగ్గర కాదండోయ్.అమెరికాలో.

( America ) అక్కడ బ్యాంకింగ్ సంక్షోభం రోజురోజుకూ దారుణంగా తయారవుతోంది.దీనికి సిలికాన్ వ్యాలీ బ్యాంక్( Silicon Valley Bank ) కారణభూతమైంది.

ఆ బ్యాంకు కుప్పకూలడంతో మెుదలైన అలజడి పరంపరగా కొనసాగుతోంది.ఈ లిస్టులో సిగ్నేచర్ బ్యాంక్, ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకులు కూడా చేరిపోయాయి.

Advertisement

రానున్న రోజుల్లో అక్కడ మరిన్ని బ్యాంకులు మూతపడనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

తాజాగా అక్కడ ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్( First Republic Bank ) దివాలా తీయడంతో పరిస్థితి దారుణంగా తయారయింది.అయితే ఈ బ్యాంకుని జేపీ మోర్గన్ చేస్ కొనుగోలు చేస్తోంది.ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన బ్యాంకును రెగ్యులేటర్లు ఇపుడు అక్కడ సొంతం చేసుకుంటున్నారు.

గత 2 నెలల్లో దివాలా తీసిన మూడో బ్యాంక్ గా ఫస్ట్ రిపబ్లిక్ అక్కడ పెనుదుమారాన్ని సృష్టించింది.కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ప్రధాన కార్యాలయం కలిగి ఉన్న బ్యాంక్ డిపాజిట్లు, అన్నిరకాల ఆస్తులను స్వాధీనం చేసుకోన్నట్లు కాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అండ్ ఇన్నోవేషన్ వెల్లడించింది.

ఇకపోతే, అమెరికాలోని 8 రాష్ట్రాల్లో ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ కు 84 కార్యాలయాలు ఉన్నట్టు తెలుస్తోంది.ఇక తాజా చర్య తర్వాత ఈ శాఖకు ఇకపై జేపీ మోర్గాన్ చేజ్ కార్యాలయాలుగా తిరిగి తెరవబడతాయని తెలుస్తోంది.ఇకపోతే ఈ తరుణంలో డిపాజిటర్లకు వచ్చిన నష్టమేమీలేదని తెలుస్తోంది.

ఇదేం ఫ్యాషన్ రా బాబోయ్.. బబుల్ ర్యాప్‌తో డ్రెస్ అట.. ధర తెలిస్తే అంతే!
బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!

ఎందుకంటే వారంతా ఇపుడు జెపి మోర్గాన్ చేజ్ బ్యాంక్, నేషనల్ అసోసియేషన్ డిపాజిటర్లు మారనున్నారు కాబట్టి.దీంతో 1985లో స్థాపించబడిన ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ ప్రస్థానం నేటితో ముగియనుంది.

Advertisement

కేవలం 10 మందితో మొదలైన ఫస్ట్ రిపబ్లిక్ జూలై 2020 నాటికి అమెరికాలో 14వ అత్యుత్తమ బ్యాంక్ గా నిలిచింది.

తాజా వార్తలు