రైలులో అగ్నిప్రమాదం.. 46 మంది మృతి

రైలులో మంటలు చెలరేగి ఏకంగా 46 మంది మృత్యువాత పడిన ఘటన పాకిస్థాన్‌లో చోటు చేసుకుంది.

కరాచీ నుండి బయల్దేరిన తేజ్‌గామ్ ఎక్స్‌ప్రెస్ రైలులోని వంటగదిలో సిలిండర్లు పేలి మంటలు చెలరేగాయి.

దీంతో మంటలు మూడు బోగీలకు వ్యాపించాయి.తల్వారీ రైల్వేస్టేషన్ దాటిన తరువాత ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా ఈ ప్రమాదంలో ఏకంగా 46 మంది అగ్నికి ఆహుతయ్యారు.సమాచారం అందుకున్న అధికారులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

ఒక్కసారిగా రైలులో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.వారు అరుపులతో పరుగులు పెట్టారు.

Advertisement

కాగా రైలును ఉన్నఫలంగా ఆపేసి తమ ప్రాణాలను దక్కించుకునే ప్రయత్నం చేశారు.ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

కాగా తీవ్రంగా గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.సహాయక చర్యల్లో అధికారులు పూర్తిగా నిమఘ్నమయ్యారు.

ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు