రంగును బట్టి మీ వ్యక్తిత్వం గురించి తెలుసుకోండి..?

ఒక్కో మనిషికి ఒక్కొక్క రంగును చూసినప్పుడు ఒక్కో అనుభూతి కలుగుతుంది.అంతే కాదు మనకు నచ్చిన రంగు మనం ఏంటో చెబుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

అయితే ఏ రంగు ఇష్టపడితే ఎలాంటి స్వభావం కలిగి ఉంటారు.మరి మీకు ఇష్టమైన రంగు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఎరుపు రంగు ను ఇష్టపడే వారు ( Red color )ఎప్పుడు లోతైన జ్ఞానన్ని పొందాలని అనుకుంటూ ఉంటారు.ఈ రంగును ఇష్టపడే వారు కాస్త పొగరుగా వ్యవహరిస్తారు.

అయితే ఈ వ్యక్తులకు పట్టుదల ఎక్కువగా ఉంటుంది.

Advertisement

చేపట్టిన ప్రతి పనిని ఎలాగైనా పూర్తి చేసే శక్తి సామర్థ్యాలు వీళ్లకు ఉంటాయి.అలాగే నీలం రంగు ఇష్టపడేవారు లోతుగా ఆలోచిస్తూ ఉంటారు.అలాగే వాళ్లకి విశాలపై ప్రావీణ్యం ఎక్కువగా ఉంటుంది.

అయితే వీళ్ళకి హడావిడి ఉండదు.పని చేయడానికి అవసరమైన సమయాన్ని మాత్రమే తీసుకుంటారు.

ఈ రంగును ఇష్టపడేవారు నిజం చెప్పాలని అనుకుంటూ ఉంటారు.ఇంకా చెప్పాలంటే పసుపు రంగును ఇష్టపడే వారు వ్యక్తిగత భావోద్వేగాలను అదుపు చేసుకునే ప్రయత్నంలో ఉంటారు.

అలాగే వీరిలో ఆత్మవిశ్వాసం( self confidence ), ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది.వీళ్ళు ఆలోచన పరులు.వీరు ఆలోచనలను అణిచివేయాలని అనుకోరు.

శోభన్ బాబు కలర్ గురించి జయలలిత తల్లి అలా అన్నారా.. అసలేం జరిగిందంటే?
ఇండియాలోనే అతిపెద్ద ట్రక్కు.. దీనికి ఎన్ని చక్రాలు ఉన్నాయో తెలిస్తే..

ముఖ్యంగా చెప్పాలంటే నలుపు రంగును ఇష్టపడేవారు ప్రతిష్ట, అధికారాన్ని కోరుకుంటారు.దృఢ సంకల్పం కలిగి ఉంటారు.

Advertisement

ఈ వ్యక్తులు తమ బలహీనతను ఇతరులకు చెప్పరు.అలాగే ఆకుపచ్చ రంగు ఇష్టపడేవారు ఎప్పుడు విశ్రాంతి, ప్రశాంతత తో ఉండడం లాంటివి చేస్తారు.

అలాగే ఆకుపచ్చ ప్రేమికులు ఎప్పుడూ ఉత్తమ వ్యక్తులుగా ఉంటారు.ముఖ్యంగా చెప్పాలంటే తెలుపు రంగు( White Color )ను ఇష్టపడేవారు ప్రశాంతంగా ఉంటారు.

సరళత, ప్రశాంతత వంటివి వ్యక్త పరుస్తారు.ఎప్పుడూ ప్రశాంతంగా, సమతుల్యంగా ఉంటారు.

ఆత్మవిశ్వాసంతో ఉంటారు.అలాగే వీరు దృఢంగా, తెలివిగా ఆలోచిస్తూ ఉంటారు.

తాజా వార్తలు