ఒకప్పుడు ఎన్నో బ్లాక్బస్టర్ ప్రేమకథా సినిమాలతో లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్న తరుణ్ ( Tarun ) 40 ఏళ్ల వయసు వచ్చినా కూడా పెళ్లి చేసుకోవడం లేదు.అయితే ఈ మధ్యకాలంలో తరుణ్ తల్లి రోజా రమణి కొన్ని ఇంటర్వ్యూలలో పాల్గొని ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టడమే కాకుండా తన కొడుకు తరుణ్ మళ్లీ సినిమాల్లో రియంట్రీ ఇవ్వబోతున్నాడని అలాగే మరికొద్ది రోజుల్లో పెళ్లి కూడా చేసుకోబోతున్నాడని సమాచారం ఇచ్చింది.
అయితే ఆ ఇంటర్వ్యూలో పాల్గొన్న రోజా రమణి ( Roja ramani ) నా కొడుకు ఇండస్ట్రీలో ఉండే ఓ పెద్దింటి పిల్లను పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ కూడా సమాచారం ఇచ్చింది.అయితే పెద్దింటి పిల్ల అనగానే అందరికీ మెగా ఫ్యామిలీ మాత్రమే గుర్తుకొస్తుంది.అయితే మీకు అనుమానం రావచ్చు.ఇండస్ట్రీలో ఇన్ని బడా ఫ్యామిలీస్ ఉన్నాయి కదా మరి మెగా ఫ్యామిలీ ( Mega family ) నే ఎందుకు.అలాగే ఇప్పటికే మెగా ఫ్యామిలీ లో ఉన్న అమ్మాయిలకు పెళ్లిళ్లు అయ్యాయి కదా అని.అయితే ఇండస్ట్రీలో ఉండే నందమూరి ఫ్యామిలీలో ఇద్దరమ్మాయిలకు పెళ్లిళ్లు జరిగాయి.అలాగే అక్కినేని ఫ్యామిలీలో అమ్మాయిలు లేరు.అయితే అందరికీ మెగా ఫ్యామిలీ నే గుర్తుకు వస్తుంది.
కానీ ఇప్పటికే మెగా ఫ్యామిలీలో ఉండే ముగ్గురు అమ్మాయిలకి పెళ్లిళ్లు అయ్యి అందులో ఇద్దరు అమ్మాయిలు భర్తలతో విడాకులు తీసుకున్నారు.అయితే నెట్టింట్లో ఇలాంటి వార్తలు వైరల్ చేసే కొంతమంది మెగా డాటర్స్ తరుణ్ నిహారికనో లేదా శ్రీజ ( Sreeja ) నో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వైరల్ చేస్తున్నారు.కానీ తరుణ్ అభిమానులు ఊరుకుంటారా.మా హీరోకి ఆ అమ్మాయిలను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏం వచ్చింది.ఆయన పెళ్లి కి రెడీ అంటే ఎంతోమంది అందమైన అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తారు.ఆయనకేం తక్కువ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ఏది ఏమైనా అప్పటికి తరుణ్ ( Tarun ) పై ఇలాంటి వార్తలు రావడం ఆయన అభిమానులకు కాస్త ఇబ్బందికరంగా ఉంది.